కమల్ కూతురిగా ఇండస్ట్రీకి పరిచయమైన శృతి హాసన్.. మొదట్లో గ్లామర్ కు పెద్దపీట వేయకుండా మామూలు సినిమాలు చేసింది.  తరువాత, గ్లామర్ కు తెరలేపింది.  ఎప్పుడైతే అలాంటి సినిమాలకు ఒకే చెప్పిందో వరసగా ఆఫర్లు రావడం మొదలు పెట్టాయి.  
గబ్బర్ సింగ్, బలుపు, రేసు గుర్రం, శ్రీమంతుడు వంటి ఎన్నో సినిమాలు ఆమె ఖాతలో ఉన్నాయి.  పవన్ కాటమరాయుడు తరువాత మరలా సినిమా చేయలేదు.  ఇప్పుడు బలుపు కాంబినేషన్లో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నది.  ఆమె రెడీగానే ఉన్నది.  
యూనిట్ కూడా రెడీనే కానీ, పారితోషికం విషయంలోనే ఇంకా డీల్ సెట్ కాలేదు.  సినిమా చేయడానికి శృతి కోటిన్నర డిమాండ్ చేస్తోంది.  అంత ఇచ్చేందుకు నిర్మాతలు సిద్ధంగా లేరు.  అంతకు తగ్గేందుకు శృతి సిద్ధంగా లేదు.  ఇద్దరి మధ్య చర్చలు నడుస్తున్నట్టు తెలుస్తోంది.  
నాలుగున్నర సంవత్సరాల గ్యాప్ తరువాత నటిస్తూ అంత డిమాండ్ ఏంటని నిర్మాతలు అంటుంటే.. నేనంతే తగ్గేది లేదని శృతి అంటోందట..  ఒకవేళ శృతి తగ్గకపోతే.. వేరే హీరోయిన్ ను సెట్ చేయాలనీ నిర్మాతలు అనుకుంటున్నారు.  మరి చూద్దాం ఎం జరుగుతుందో.


మరింత సమాచారం తెలుసుకోండి: