రానా హీరోగా వేణు ఊడుగుల దర్శకత్వంలో 'విరాటపర్వం 1992' చిత్రం రూపొందనుంది. వచ్చే నెల నుంచి షూటింగ్ నిర్వహిస్తారు. ముందుగా హీరోయిన్ సాయిపల్లవి పాల్గొనే సన్నివేశాలను చిత్రీకరిస్తారు. ప్రముఖ నటి టబు ఇందులో కీలక పాత్ర పోషించనుంది.


ప్రస్తుతం రానా పలు ప్రాజెక్టులతో చాలాా బిజీ బిజీ గా గడుపుతున్న సంగతి తెలిసిందే. హాతీ మేరీ సాతీ సినిమాతో పాటు గుణశేఖర్ దర్శకత్వంలో హిరణ్యకశ్యప మరియు వేణు ఉడుగుల దర్శకత్వంలో రూరల్ తెలంగాణ నేపథ్యంలో మరో సినిమా రానా లిస్ట్ లో ఉన్నాయి. ఇలా బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా తన డైరీలో మరో సినిమాకు స్పేస్ ఇచ్చారు రానా.


సిద్దార్ధ్ నటించిన గృహం సినిమాతో మంచి ప్రశంసలు అందుకున్న మిలింద్ డైరెక్షన్ లో మరో కొత్త సినిమాకు రానా ఓకే చెప్పారు. విశ్వమిత్ర శాంతి పిక్చర్చ్ బ్యానర్ పై గోపీనాథ్ ఆచంట ఈ సినిమాను నిర్మిస్తున్నారు. స్క్రీప్ట్ వర్క్ పూర్తయిన ఈ సినిమా ఆగష్ట్ నుండి రెగ్యులర్ షూటింగ్ ను జరుపుకోనున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా క్యాస్ట్ అండ్ క్రూ కి సంబంధించిన వివరాలు త్వరలో ప్రకటించనున్నారు.


మొత్తానికి గత ఏడాది ఒక్క సినిమాతో కూడా పలకరించని రానా.. ఈ ఏడాది ఒక సినిమా తరువాత ఒకటి చేస్తూ ఖాళీ లేకుండా బిజీ బిజీ గా గడుపుతున్నాడు. మరి ఈ సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయో చూడాలి అని ప్రేక్ష‌కులంతా వేచి చూస్తున్నారు,


మరింత సమాచారం తెలుసుకోండి: