"మీ టూ"  ఉద్యమం గురించి అందరికి తెలిసిందే. లైంగికంగా తమని వేధించారంటూ చాలా మంది నటీమణులు ఈ ఉద్యమంలో పాల్గొన్నారు.  అసలు మొదటగా ఈ ఉద్యమం స్టార్ట అయ్యింది హాలీవుడ్ లో మొదలయ్యింది. పెద్ద పెద్ద నిర్మాణ సంస్థల అధిపతులు ఇందులో ఇరుక్కున్నారు. అంతలా ప్రభావం చూపించింది అక్కడ.
ఇక ఇండియాలో "మీ టూ " ఉద్యమానికి ఊపిరి పోసింది మాత్రం " తనుశ్రీ దత్తా"  ఒకానొక షూటింగ్ లో తన సహ నటుడు బాలీవుడు వెర్సటైల్ ఆక్టర్ అయిన నానా పాటేకర్ తనని లైంగికంగా వేధించాడని ఆరోపించింది. ఒక్కసారిగా బాలీవుడ్ షాక్ కి గురయ్యింది.  "తనుశ్రీ దత్తా" తర్వాత చాలా మంది హీరోయిన్లు  ఈ మీ టూ ఉద్యమంలో పాల్గొన్నారు. అయితే కొంతమంది అవతలి వారి పేర్లను బయటకి వెల్లడించలేదు.
నానా పాటేకర్ లైంగికంగా వేధించడం హాట్ టాపిక్ గా మారింది. అయితే దీనికి సంబంధించి  తనుశ్రీ దత్తా పోలీసు కేసు వేసింది. అయితే ఆమె ఇప్పుడు అమెరికాలో ఉండగా ఒక విషయం ఆమెను కలవర పరిచింది. అదేంటంటే, నానా పాటేకర్ తన మీద క్లీన్ చిట్ కోసం ప్రయత్నిస్తున్నాడనే విషయం ఆమెను కలవరానికి గురి చేసింది. ఆమె ఇంతకు ముందు ఒకానొక ఇంటర్వ్యూ లో  సాక్షులని బెదిరిస్తున్నారని పేర్కొంది.
సాక్షులకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, భయభ్రాంతులకు గురి చేస్తున్నారని పేర్కొంది. మొత్తం10 మంది సాక్షులు ఉంటే కేవలం ఒక్కరు మాత్రమే ముందుకు వచ్చారని మిగతా అందరికీ బెదిరింపు కాల్స్ రావడం వల్ల ముందుకు రావట్లేదని పేర్కొంది. సాక్షాలు సరిగ్గా లేకపోతే పోలీసులు తామేం చేయలేమని చెప్పారు. ఈఇ తరుణంలో నానా పాటేకర్ తన మీద ఎటువంటి తప్పు చేయలేదని, క్లీన్ చిట్ కోసం ప్రయత్నిస్తున్నాడనే విషయం ఆమెను విస్మయానికి గురి చేసింది. ఆ కోపంలో అసలు ఇండియాకి రావాలని లేదని పేర్కొంది.


మరింత సమాచారం తెలుసుకోండి: