సినిమా ఇండస్ట్రీలో బ్రేకప్స్ చాలా ఎక్కువగా చూస్తుంటాం. ఇప్పుడు బ్రేకప్ చేసుకున్న వాళ్ళే కొన్ని రోజుల తర్వాత మళ్ళీ వేరే వాళ్ళతో ప్రేమలో ఉంటారు. ఇవన్నీ చాలా సర్వ సాధారణం. మరీ ముఖ్యంగా గ్లామర్ ఇండస్ట్రీ కాబట్టి ఇటువంటివి ఎక్కువగా జరుగుతుంటాయి. ఇంకా జనాలకి కూడా ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మనం అటువంటి ఒక బ్రేకప్ స్టోరీ గురించి తెలుసుకుందాం.
టాలీవుడ్ లో దాదాపు సీనియర్, ఇంకా పెద్ద కుటుంబం నుండి వచ్చిన నటి ఇటీవల  ఒక యంగ్ హీరోతో బ్రేకప్ చేసుకుంది. దీనికి కారణాలు ఏంటి అనేది  ఇంకా తెలిసి రాలేదు. ఆ యంగ్ హీరో ఇప్పటికే చాలా సినిమాల్లో నటించి తన టాలెంట్ ని నిరూపించుకున్నాడు. వీరు చాలా రోజుల నుండి సహజీవనంలో ఉంటున్నారు. ఈ విషయం గురించి చాలా రోజుల నుండి ఇండస్ట్రీలో చర్చ జరుగుతుంది. కానీ అనూహ్యంగా వారిద్దరు విడిపోయారనే వార్త హల్ చల్ చేస్తుంది.
కానీ ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య సఖ్యత చెడిందని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం వాళ్ళిద్దరు విడిపోయారు. యంగ్ హీరో తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోయాడట.
సీనియర్ నటి తన సొంత ఇంటిలోనే ఉంటుందట. వాళ్ళిద్దరు అస్సలు మాట్లాడుకోవడం లేదంట. కనీసం ఒకరినొకరు చూసుకోవట్లేదంట. చూసుకోవడానికి కూడా ఇష్టపడట్లేదంట. ఇదంతా చూస్తుంటే వాళ్ళిద్దరి మధ్య ఏదో పెద్ద యుద్ధమే జరిగినట్టు అనిపిస్తుంది.
వారిద్దరు ఒకరికొకరు కంట పడకుండా  తప్పించుకుంటున్నారట. అలా ఉండటం కోసం వాళ్లు రెగ్యులర్ గా వెళ్ళే ప్లేసెస్ కి కూడా వెళ్ళట్లేదంట. చూడాలి ఇలా ఎన్ని రోజులు ఉంటారో. ఇండస్ట్రీలో కలుసుకోవడం విడిపోవడం కామనే కాబట్టి వాళ్ళు మళ్ళీ కలిసిన ఆశ్చర్యపోనవసరం లేదు.  టాలీవుడ్ మొత్తం ఈ టాపిక్  మీదనే డిస్కస్ చేస్తుంది ప్రస్తుతం.


మరింత సమాచారం తెలుసుకోండి: