అంతకముందు క్రేజ్ ఎలా ఉన్నప్పటికి 'బాహుబలి'తో ప్రభాస్‌ రేంజ్‌ ఖచ్చితంగా పెరిగిందన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఎంత రేంజ్ పెరిగింది, ఇప్పుడు ప్రభాస్ ఎంత పెద్ద స్టార్‌ అనే దానిపై ఎవరికీ ఖచ్చితమైన అంచనాలు లేవు. రాజమౌళిని మినహాయిస్తే... మిగతా టాప్‌ హీరోల మార్కెట్‌ వంద కోట్ల దగ్గరే ఆగిపోయింది. ఇంతవరకు బాహుబలి కాకుండా జెన్యూన్‌గా వంద కోట్ల షేర్‌ దాటిన టాలీవుడ్ సినిమాలు రంగస్థలం, ఖైదీ నంబర్‌ 150 మాత్రమే. మిగతా సినిమాలకి నిర్మాతలే భారీ వసూళ్లు వేసుకుంటే తప్ప వంద దాటడం సాధ్యపడడం లేదు.


మరి తెలుగు సినిమా మార్కెట్‌ వంద కోట్లు టచ్‌ చేయడానికి టికెట్‌ రేట్లు పెంచడం వగైరా లాంటి ఎన్ని జిమ్మిక్కులు చేసి నానా అవస్థలు పడుతోంటే సాహో సినిమాని 'బాహుబలి'తో సమానంగా ఎలా కొనేస్తారు? సీడెడ్‌లో 'సాహో' సినిమాకి పాతిక కోట్లు పెట్టారంటే ప్రభాస్‌ అభిమానులకే భయం పట్టుకుంది. బాహుబలిని పక్కన పెడితే సీడెడ్‌ మార్కెట్‌ పదిహేను కోట్ల దగ్గరే ఆగిపోయింది.
అలాంటి చోట ప్రభాస్‌ ఒక్కడే పాతిక కోట్లు రాబట్టగలడా? అలాగే కర్నాటకలో ఇరవై ఏడు కోట్లకి అమ్మారంటే... రిటర్న్‌ ఎంత వుంటుంది? ఎప్పటికి వస్తుంది? బాహుబలి తర్వాత ప్రభాస్‌ రేంజ్‌ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా పక్క రాష్ట్రాల్లోను పెరిగింది.

కానీ దానికి ఖచ్చితమైన కొలమానం లేకుండా ఇప్పుడు గట్‌ ఫీలింగ్‌తో బయ్యర్లు బెట్‌ కడుతున్నారు. ఇది వర్కవుట్‌ అయితే ఓకే కానీ లేదంటే రంగస్థలం వసూళ్లని దాటినా కానీ సాహో సక్సెస్‌ అనిపించుకోలేదు! అంతేకాదు మరీ ఓవర్ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకుంటే మాత్రం బయ్యర్లు రోడ్డున పడే అవకాశం లేకపోలేదు. మరి ఈ సాహో ముంచుతాడో తేలుస్తాడో..


మరింత సమాచారం తెలుసుకోండి: