టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోలకు వరసగా గాయలవుతున్నాయి.  మొన్న షూటింగ్ కోసం హైదరాబాద్ నుంచి బయలు దేరిన వరుణ్ తేజ్ మార్గమధ్యలో కార్ యాక్సిడెంట్ జరిగింది.  అయితే, అదృష్ట వశాత్తు ఎలాంటి ప్రమాదం జరగలేదు.  అయితే, ఎదురుగా ఉన్న ఇండికా కారులోని ముగ్గురికి గాయాలయ్యాయి.  


ఇది జరిగిన మరుసటి రోజు, యువ హీరో నాగశౌర్య సినిమా షూటింగ్ లో గాయపడ్డాడు.  ఓ రిస్కీ సీన్స్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.  దీంతో కాలికి బలమైన గాయం తగలడంతో వెంటనే ఆయనను హాస్పిటల్ కు తరలించారు.  మూడు వారాలు రెస్ట్ తీసుకోమని చెప్పారట.  


ఇది జరిగిన మరుసటి రోజు హీరో సందీప్ కిషన్ కు గాయాలయ్యాయి.  తెనాలి రామకృష్ణ షూటింగ్ లో ఓ బాంబ్ బ్లాస్ట్ సీన్ చేసే సమయంలో సమన్వయ లోపం కారణంగా సందీప్ కిషన్ గాయపడ్డాడు.  వెంటనే సందీప్ ను కర్నూలులోని హాస్పిటల్ కు తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు.  


వరసగా టాలీవుడ్ హీరోలకు ఇలా గాయాలు అవుతుండటంతో ఇండస్ట్రీ భయాందోళనకు లోనవుతుంది. టాలీవుడ్ ఇండస్ట్రీకి ఏమౌతున్నదో అర్ధంకాని పరిస్థితుల్లో ఉండిపోయింది.  


మరింత సమాచారం తెలుసుకోండి: