కుమారి 21ఎఫ్ గా ముంబై బ్యూటీ హెబ్బా పటేల్ టాలీవుడ్‌కు గ్రాండ్‌గా ఇచ్చిన ఎంట్రీ గురించి తెలిసిందే. ప్రారంభంలోనే సెన్సేషన్స్ తో పరిశ్రమ వర్గాల దృష్టిని ఆకర్షించిన హెబ్బా కుమారి 21ఎఫ్ తర్వాత వరుసగా అరడజను పైగానే సినిమాలకు సంతకాలు చేసింది. అవన్నీ చాలా తక్కువ గ్యాప్ తో తన వెంట పడిన ఆఫర్స్. అయితే కుమారి హడావుడిగా తప్పులో అడుగేసిందని అర్థమవ్వడానికి చాలా తక్కువ టైం పట్టింది. వరుసగా తనవైపు వచ్చిన ఏ ఆఫర్ ని అస్సలు విడిచిపెట్టలేదు. అయితే ఈ యాటిట్యూడే తన కెరీర్ కు పెద్ద డ్యామేజ్ అయింది. 


కుమారి 21 ఎఫ్ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత హెబ్బా ఈడోరకం - ఆడోరకం.. ఎక్కడికి పోతావు చిన్నవాడా?.. మిస్టర్.. నాన్న నేను బోయ్ ఫ్రెండ్..  అంధగాడు.. ఏంజెల్.. ఇలా వరుసగా సినిమాల్లో నటించింది. ఈ సినిమాలలోలో ఎక్కడికి పోతావు చిన్నవాడా?  తప్ప మిగతా అన్ని సినిమా ఫ్లాప్స్, డిజాస్టర్స్‌గా నిలిచాయి.  ఆ ప్రభావం తన కెరీర్ పై చాలా గట్టిగా పడింది. ఆ టైం లో అనుకోకుండా అవకాశం వచ్చిన 24 కిస్సెస్ అనే మరో బోల్డ్ సినిమాతో సత్తా చాటాలని ఆశపడింది. కానీ డీగ్రేడ్ కంటెంట్ తో ఇక్కడ నెగ్గుకు రాలేమని తెలుసుకోవడానికి ఎక్కువ సమయం పట్టలేదు. తెలిసి చేసిన తప్పో.. లేక స్వయంకృతాపరాధమో గానీ మొత్తానికి హెబ్బా కెరీర్ కి బ్రేక్ పడిపోయింది.


ప్రస్తుతం హెబ్బా కెరీర్ ఖాళీగా ఉండటంతో పూర్తిగా డీలా పడిపోయిందని అర్థమవుతోంది. ప్రస్తుతానికైతే సోషల్ మీడియాలో అభిమానులకు ఫోటోషూట్లు షేర్ చేయడం తప్ప హెబ్బా కి ఛాన్సుల్లేవ్. ఇక టాలీవుడ్ లో అందం కంటే ట్యాలెంటుతో నెగ్గుకొచ్చిన హెబ్బా ఘనమైన ఆరంభాన్ని ఎక్కువ కాలం సస్టెయిన్ చేయడంలో తడబడిందనే చెప్పాలి. తెలుగుతో పాటు తమిళం.. కన్నడంలోనూ ఈ హెబ్బాకి సరైన అవకాశాల్లేవు. తెరపై ఎలాంటి బోల్డ్ సీన్స్ కి నో చెప్పని హీరోయిన్‌గా పేరు తెచ్చుకోవడంతో తనకోసం వచ్చిన కథలు బోల్డ్ కంటెంట్ తోనే వచ్చాయి. దాని ప్రభావం హెబ్బా కెరీర్ పై పడిందని అందరు అనుకుంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: