వరుసగా సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ కాకపోయినా కొంతమంది హీరోలకి వాళ్ళ టైం బాగుంటే అవకాశాలు వాటంతట అవే ఒకేసారి వస్తాయి. ఏ సినిమా ఒప్పుకోవాలో ఏది ఒప్పుకోకూడదో తెలీక అయోమయంలో పడేస్తాయి. ఇప్పుడు సుధీర్ బాబు పరిస్థితి అలాగే అయింది. బాలీవుడ్ లో మంచి చాన్స్ మిస్ అయిపోయింది. సమ్మోహనం సినిమా తరువాత గోపీచంద్ బయోపిక్ తన స్వంత బ్యానర్ లో స్టార్ట్ చేసాడు సుధీర్ బాబు. ఇంతలో ఇంద్రగంటి మోహన కృష్ణతో దిల్ రాజు  నిర్మాణంలో చాన్స్ వచ్చింది. రావడమే కాదు, స్టార్ట్ అయిపోయింది. 


అదే సమయంలో హిందీ సినిమా బ్రహ్మాస్త్రలోను అవకాశం వచ్చింది. కానీ ఏం లాభం? వదిలేసుకోవాల్సి వచ్చింది. బ్రహ్మాస్త్ర సినిమా కోసం నాగార్జున, సుధీర్ బాబు ఇలా సౌత్ స్టార్స్ ను తీసుకోవాలనుకున్నారు. గతంలో సుధీర్ బాబు ఓ సినిమాలో నెగిటివ్ రోల్ చేసి వుండడంతో, మళ్లీ అదే  నెగిటివ్ షేడ్స్ వున్న క్యారెక్టర్‌ను ఆఫర్ చేసారు.
కానీ సమస్య వచ్చింది ఇక్కడే. ఆ బాలీవుడ్ సినిమా గనక ఓకే అనుకుంటే.. టాలీవుడ్‌లో ఒప్పుకున్న  సినిమాలన్నీ పక్కన పెడితే తప్ప, అక్కడి డేట్ లతో మ్యాచ్ కావడం లేదట. 
దాంతో చేసేదిలేక, భారీ కాస్టింగ్ ఉన్న బాలీవుడ్ సినిమాని వదులుకున్నాడు. నిజానికి ఏ మాత్రం వీలు చేసుకున్నా ఓ భారీ ప్రాజెక్టులో పార్ట్ అయి వుండేవాడు. 


అంతేకాదు, బాలీవుడ్‌లో ఇంకా పాపులర్ అయ్యోవాడు. మిగతా సినిమాలకు డేట్స్ అడ్జెస్ట్ చేసి స్వంత సినిమా గోపీచంద్ బయోపిక్ ను కాస్త పక్కనపెట్టి, బాలీవుడ్ ఆఫర్  ఓకె చేసి వుంటే బాగుండేదేమో? కానీ అలా చేయలేదు.. సుధీర్ బాబు ఐడియా ఏమిటో తెలీలేదు కానీ ఇప్పుడు ఆ సినిమాని చేసి ఉండాల్సింది అని మాత్రం సుధీర్ బాగా ఫీలవుతున్నాడట. 


మరింత సమాచారం తెలుసుకోండి: