ప్రభాస్ సాహో సినిమా షూటింగ్ సంగతిని పక్కనపెడితే.. సినిమా రిలీజ్ విషయంలో స్పీడ్ చేసింది.  నిర్మాణాంతర కార్యక్రమాలు చురుగ్గా సాగుతున్నాయి.  ఎక్కడా అలసత్వం ప్రదర్శించకుండా ఫాస్ట్ గా కంప్లీట్ చేసే  పనిలో ఉన్నారు.  జూన్ 13 న రిలీజైన అదిరిపోయింది.  

ఇప్పుడు అందరి చూపులు ట్రైలర్ పై ఉన్నాయి.  హాలీవుడ్ రేంజ్ లోను, బాలీవుడ్ కు దిమ్మదిరిగే గిదంగా టీజర్ ఉన్నది.  ఇదే ఊపులు మరో 20 రోజుల్లో ట్రైలర్ రిలీజ్ చేస్తే బాగుంటుంది కదా.  హాలీవుడ్ లో సినిమా రిలీజ్ కు ముందు రెండు మూడు ట్రైలర్ లు రిలీజ్ చేస్తారు.  

దీంతో  ఇంటరెస్ట్ పెరుగుతుంది.  అలానే సాహో సినిమా విషయంలో కూడా ఇలానే చేస్తే బాగుంటుంది.  ఇటీవల కాలంలో బాలీవుడ్ లో కూడా ఇలాంటి ప్రయోగాలు చేస్తున్నారు.  తెలుగులో ప్రీ రిలీజ్ బిజినెస్ సమయంలోనో లేదంటే ఆడియో వేడుక సమయంలోనో ఇలాంటి చేస్తుంటారు.  

ఇపుడు ఆడియో వేడుకలను పెద్దగా నిర్వహించడం లేదు.  ప్రీ రిలీజ్ వేడుకలను నిర్వహించి చేతులు దులుపుకుంటున్నారు. సాహో సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ కావడంతో రాధాకృష్ణపై ఒత్తిడి పడుతున్నది.  జాన్ సినిమాను సాహో కంటే బాగా ఉండాలని ప్రభాస్ అభిమానులు కోరుకుంటున్నారు.  ఇది సహజమే. 


మరింత సమాచారం తెలుసుకోండి: