సాహో టీజర్ ను అందరు ఆకాశానికి ఎత్తేశారు.  సెలెబ్రిటీలు సైతం హాలీవుడ్ రేంజ్ లో ఉందని ట్వీట్ చేశారు.  అంతా బాగానే ఉంది. ట్వీట్ చేయడాలు సరే.   ఈ టీజర్ ను పరిశీలించి చూస్తే కొంత నెగెటివ్ ఎఫెక్ట్ కనిపించేలా ఉన్నది.  ఎమోషన్స్, కొన్ని యాక్షన్ సీన్స్ మహేష్ బాబు 1 నేనొక్కడినే సినిమాలో ఉన్నట్టుగా కనిపిస్తుంది.  

అలాగే స్పైడర్ మెన్ లోని కొన్ని ఎఫెక్ట్స్ టీజర్ లో కనిపిస్తున్నాయి.  ఆ టీజర్ లు రెండు కూడా సూపర్బ్ గా ఉంటాయి.  రెండు సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలే. రెండింటిలోనూ యాక్షన్ పార్ట్ సూపర్బ్ గా ఉంటుంది.  బట్, సినిమా రిలీజ్ తరువాత అబ్బే పెద్దగా ఏమిలేదు చెప్పుకోవడానికి అని పెదవి విరిచారు.  

బాహుబలి సమయంలో ఎలాంటి హైప్  వచ్చిందో అంతకంటే హైప్ ఈ సినిమాకు వచ్చింది.  ఈ స్థాయిలో వచ్చింది కాబట్టి సినిమా ఎలా ఉంటుందో అనే క్యూరియాసిటీ పెరిగింది.  అయితే, ఈ క్యూరియాసిటీకి తగ్గట్టుగా సినిమా ఉంటె తిరుగుండదు.  

ఒకవేళ అలా కాకుంటే మాత్రం ప్రభాస్ కు పెద్ద దెబ్బ పడుతుంది.  ఒక్క ప్రభాస్ కాదు సినిమా తీసుకున్న బయ్యర్లకు చేదు అనుభవం ఎదురు కావాల్సి వస్తుంది .  అలా జరగకూడదని కోరుకుందాం.  ఎందుకంటే ఇండియన్ సినిమా హాలీవుడ్ స్థాయిని అందుకోబోతున్నది.  అంతకంటే మనకు కావాల్సింది ఏముంది.


మరింత సమాచారం తెలుసుకోండి: