ఒక్కసారి ఒక్క సెంటిమెంట్ వర్కౌట్ అయితే.. దాన్ని మన సినిమా ఇండస్ట్రీ అసలు వదలదు.  కాంబినేషన్, క్యారెక్టర్స్, పేర్లు ఇలా వగైరా వగైరా ఉంటాయి.  ఇవన్నీ సినిమాకు ప్లస్ అవుతాయి.  అక్కినేని కుటుంబం ఓ సెంటిమెంట్ ను విపరీతంగా ఫాలో అవుతున్నది. 

నాగచైతన్య మొదటి సినిమా జోష్... ప్లాప్ కావడంతో.. నెక్స్ట్ సినిమా ఏం మాయ చేశావే చేశారు.  ఆ సినిమాలో జెస్సి క్యారెక్టర్ హైలైట్ అయ్యింది.  అందరు అప్పటినుంచి సమంతను జెస్సి అని పిలిచేవారు.  ఆ సినిమా తరువాత.. చైతుతో కలిసి ఆటో నగర్ సూర్య చేసింది.  అది ప్లాప్ అయ్యింది.  

ముచ్చటగా మూడో సినిమా మనం చేశారు.  నాగ్ ఫ్యామిలీ నుంచి వచ్చిన సినిమా 50 కోట్ల రూపాయల షేర్ ను వసూలు చేయడం అదే మొదటిసారి.  ఈ సినిమా హిట్ తో.. సమంత ఉంటె సినిమా హిట్ ఆవుతుందనే నమ్మకం వచ్చేసింది.  నాగచైతన్య.. సమంతల ప్రేమను ఆమోదించి పెళ్లి చేశారు.  అదృష్ట దేవత ఇంట్లోనే ఉంటె అంతకంటే కావాల్సింది ఏముంటుంది.  

పెళ్ళికి ముందు నాగార్జునతో కలిసి రాజుగారి గది 2 చేసింది.  అది మంచి సినిమానే. పెట్టిన డబ్బులు వచ్చేశాయి.  అక్కడి నుంచి సమంత దశ తిరిగింది.  పెళ్లి తరువాత చైతుతో చేసిన మజిలీ సూపర్ హిట్ కొట్టింది.  ఈ సినిమా కూడా 50 కోట్ల రూపాయల షేర్ వసూలు చేసింది.  సో, అక్కినేని ఫ్యామిలీ ఈ సెంటిమెంట్ ను ఇలాగే ఫాలో అవుతున్నారు.  రేపు అఖిల్ సినిమాలో కూడా వదిన సమంత ఓ రోల్ చేసినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: