రిడ్లీ స్కాట్ దర్సకత్వంలో 2000 వ సంవత్సరంలో వచ్చిన బెస్ట్ సినిమాల్లో ఒకటి గ్లాడియేటర్.  ఈ సినిమా సూపర్ హిట్టైంది.  ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో విడుదలైన ఈ చిత్రం 460 మిలియన్‌ డాలర్లను వసూలు చేసింది. రోమ్‌ సామ్రాజ్యంలో రాజులు, చక్రవర్తులు బానిసలను వేట జంతుల్లా పరగణిస్తూ, వారి ప్రాణాలతో ఏవిధంగా ఆడుకుంటారో ఇందులో చూపించారు.


ఇక ‘గ్లాడియేటర్‌’ కథ ముగిసిన 25 లేదా 30 సంవత్సరాల తర్వాత ఏం జరిగిందనే నేపథ్యంలో ‘గ్లాడియేటర్‌2’ సాగుతుందట. ఇందులో ల్యూసిల్లా పాత్ర పోషించిన నీల్సన్‌ కొడుకు ల్యూషియస్‌ పెద్దవాడైన తర్వాత ఏం చేశాడన్న ఇతివృతంగా కథ ఉంటుందని హాలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి.  


2000 సంవత్సరంలో విడుదలైన గ్లాడియేటర్‌ 11 విభాగాల్లో ఆస్కార్‌కు నామినేట్‌గా కాగా, ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు విభాగాల్లో ఆస్కార్‌ను గెలుచుకుంది. హాలీవుడ్ లో సూపర్ హిట్టైన సినిమాలకు సీక్వెల్ తీస్తున్నారు.  హిట్ కొడుతున్నారు.   


అయితే, గ్లాడియేటర్ సినిమాకు సీక్వెల్ తీయడానికి 20 సంవత్సరాలు పట్టింది.   ఈ 20 సంవత్సరాల కాలంలో గ్లాడియేటర్ సినిమాకు కనీసం నాలుగు సీక్వెల్స్ అయినా తీసేవారు.  ఎందుకని ఇంత లేట్ చేశారో అర్ధంకాని విషయం.  


మరింత సమాచారం తెలుసుకోండి: