మొన్న జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓడిపోయింది.  పార్టీ ఓటమికి అనేక కారణాలు ఉన్నాయి.  ఈ కారణాల్లో లక్ష్మీస్ ఎన్టీఆర్ కూడా ఒక కారణం అని చెప్తున్నారు.  వ్యాపారాలు చేసి కోట్లాది రూపాయలు సంపాదించినా రాకేష్ రెడ్డికి నిర్మాతగా మారి సినిమాలు తీయాలని ఒక కోరిక ఉండేది.  


దానిని లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ద్వారా తీర్చుకున్నాడు.  వర్మ చెప్పిన వెన్నుపోటు కథ నచ్చడంతో వెంటనే సినిమా చేసేందుకు ఒకే చెప్పారట. ఇలాంటి సినిమా నిర్మిస్తే కిక్కు వస్తుందని.. ఎప్పటికి గుర్తుండే సినిమా అవుతుందని.. డబ్బులు వచ్చినా రాకున్నా కూడా ఈ సినిమాతో వచ్చే కిక్ ఎప్పటికి  గుర్తిండి పోతుందని భావించి సినిమా మొదలుపెట్టారు.  


సినిమా ఎలా ఉన్నా.. ఆంధ్రప్రదేశ్ లో సినిమాను రిలీజ్ కాకుండా అప్పటి టిడిపి ప్రభుత్వం అడ్డుకుంది.  సినిమాలోని కథలో ఉన్న అంశాలు నిజమే అని బాబు విశ్వసించాడు కాబట్టి ఈ సినిమా రిలీజ్ ను అడ్డుకున్నారని అన్నారు వర్మ. 


వైకాపాకు చెందిన రాకేష్ రెడ్డి  ఎన్టీఆర్ సినిమాను నిర్మించడం అంటే అందరు సహజంగానే అతని సినిమా వైపు చూస్తారు. ఈ విషయమే రాకేష్ రెడ్డికి కలిసి వచ్చింది.   నిర్మాతకు చాలా రెస్పెక్ట్ ఇచ్చే దర్శకుడు వర్మ. ఆయన నిర్మాతలకు అనుగుణంగా సినిమాను తీస్తాడంటూ దర్శకుడు వర్మపై నిర్మాత రాకేష్ రెడ్డి ప్రశంసల వర్షం కురిపించాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: