నాగార్జున సినిమా అంటే ఏదో ఒక స్పెషల్ ఉంటుంది.  ఇలాంటి స్పెషల్ ను నాగ్ తన మన్మధుడు 2 లో చూపించబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ రిలీజ్ చేశారు.  సూపర్బ్ గా ఆకట్టుకుంది.  ఇది సినిమాకు ప్లస్ అయ్యింది.  అయితే, ఈ టీజర్ లో మొత్తం నాగ్ ను చూపించారు.  


కామెడీని, రొమాన్స్ ను చూపించారుగాని, హీరోయిన్ ను చూపించలేదు.  ఇప్పుడు దీనికోసం సెకండ్ టీజర్ ను రిలీజ్ చేయబోతున్నారు.  సెకండ్ టీజర్ లో హీరోయిన్ కు సంబంధించిన సన్నివేశాలు ఉంటాయి.  ఆమె క్యారెక్టర్ గురించి ఉంటుంది.  అయితే, ఈ సెకండ్ టీజర్ యుప్పుడు ఉంటుంది అన్నది తెలియాలి.  


ఇందులో భారీ క్యాస్టింగ్ ఉన్నది.  రకుల్, సమంత, కీర్తి సురేష్ వంటి హీరోయిన్లు నటించారు. కోడలు పిల్ల సమంత కు సంబంధించిన ఓ చిన్న టీజర్ ను కూడా రిలీజ్ చేస్తే బాగుంటుంది.  అలానే కీర్తి సురేష్ పాత్రకు సంబంధించినది కూడా.  


ఆగష్టు 9 వ తేదీన సినిమా రిలీజ్ కాబోతున్నది.  ఆడియో ఎప్పుడు ఉంటుంది.. ఆడియో కు సంబంధించిన సింగిల్స్ ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారు అనే వాటిపై ఓ క్లారిటీ ఇస్తే సినిమా ప్రమోషన్స్ షురూ అయినట్టే కదా మరి.  


మరింత సమాచారం తెలుసుకోండి: