‘మహర్షి సినిమాకు డివైడ్ టాక్ వచ్చినా సమ్మర్ రేస్ కు మరి ఏటాప్ హీరోల సినిమాలు పోటీకి రాకపోవడంతో ‘మహర్షి’ సినిమా కలెక్షన్స్ పరంగా నిలదొక్కుకుని బయ్యర్లకు భారీ నష్టాలు రాకుండా కాపాడగలిగింది. అయితే ఈమూవీని అత్యంత భారీ మొత్తాలకు కొనుకున్న ఓవర్సీస్ సీడెడ్ బయ్యర్లు మాత్రం నష్టాల నుండి బయట పడలేకపోయారు. 

దీనితో ‘మహర్షి’ మహేష్ అభిమానులు కోరుకున్న రియల్ టైం బ్లాక్ బస్టర్ గా మారలేకపోయింది. ఈ పరిస్థితులలో త్వరలో షూటింగ్ ప్రారంభంకాబోతున్న ‘సరిలేరు నీకెవ్వరు’ తో తమ బ్లాక్ బస్టర్ కోరిక తీరుతుందని మహేష్ అభిమానులు భావించారు. దీనికితోడు  ఈ సినిమాను  రీజనబుల్ బడ్జెట్ లో తీస్తున్నారని వార్తలు రావడంతో ఈసినిమాను కొనబోయే బయ్యర్లు మంచి లాభాలు వస్తాయి అన్న అంచనాలలో ఉన్నారు.

వాస్తవానికి ఈ సినిమాను అనిల్ రావి పూడి 70 కోట్ల బడ్జెట్ తో పూర్తి చేస్తాడు అని వార్తలు వచ్చాయి. అయితే ప్రస్తుతం ఈ సినిమాకు కూడ ప్రొడక్షన్ కాస్ట్ కాస్త ఎక్కువ అవుతుందని సమాచారం. స్టార్ట్ కాస్ట్ మాత్రమే కాకుండా మేకింగ్ వాల్యూస్ లో కూడా కాస్త గట్టిగా ఉండేలా అనిల్ రావిపూడి ప్లాన్ చేస్తున్న పరిస్థితులలో ఈ సినిమా మేకింగ్ ఖర్చు 90 కోట్లు దాటిపోతోందని సమాచారం. దీనితో ఈ సినిమాకు కూడ బడ్జెట్ పరంగా పెద్దదిగామారి ‘మహర్షి’ లా తయారుకాబోతోందని ఈమూవీ షూటింగ్ ప్రారంభం కాకుండానే వార్తలు హడావిడి చేస్తున్నాయి. 

దీనికితోడు ఈసారి సంక్రాంతికి బన్నీ త్రివిక్రమ్ రజనీ కాంత్ బాలకృష్ణ సినిమాల తీవ్ర పోటీ ఉన్న నేపధ్యంలో ఇంత భారీ బడ్జెట్ తో రాబోతున్న ‘సరిలేరు నీకెవ్వరు’ తట్టుకోగలదా అన్న సందేహాలు కొందరు వ్యక్తం చేస్తున్నారు. గడిచిన సమ్మర్ రేస్ కు పోటీ లేకుండా విడుదలైనా బ్లాక్ బస్టర్ హిట్ కాని మహేష్ మూవీ సంక్రాంతి రేస్ కు అన్ని భారీ సినిమాల మధ్య పోటీగా వచ్చి విజయాన్ని అందుకున్నా తిరిగి ‘మహర్షి’ ఫలితాలు మాత్రమే వచ్చి అటు మహేష్ అభిమానులకు ఇటు బయ్యర్లకు నిరాశను మిగిల్చే మరో ప్రయోగంగా ‘సరిలేరు నీకెవ్వరు’ మారబోతోందా అంటూ అప్పుడే ఈమూవీ  పై నెగిటివ్ ప్రచారం ప్రారంభం అయిపోయింది..    


మరింత సమాచారం తెలుసుకోండి: