ఇప్పుడు సినిమా తీయడం చాలా ఈజీ.  ఎందుకంటే టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది.  అంతా రెడీ అనుకుంటే.. షూటింగ్ కు వెళ్లి ఫటఫటా కంప్లీట్ చేసుకొని రిలీజ్ చేసుకుంటారు.  ఇవన్నీ జరగాలి అంటే ముందు కథ స్క్రిప్ట్ తప్పనిసరిగాఉండాలి .  


నాగార్జున ప్రస్తుతం మన్మధుడు 2 చేస్తున్నారు.  ఈ మూవీ ఆగష్టు 9 వ తేదీన రిలీజ్ కాబోతున్నది.  అంతకు ముందు నాగార్జున సోగ్గాడే చిన్నినాయనా సినిమా చేశారు.  ఆ సినిమా సూపర్ హిట్ కొట్టింది.  ఏకంగా 50 కోట్ల రూపాయల షేర్ ను వసూలు చేసింది.  


దీనికి ప్రీక్వెల్ చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు.  స్క్రిప్ట్ విషయంలో నాగార్జున ఎలా ఉంటాడో చెప్పక్కర్లేదు.  అందుకే పక్కా స్క్రిప్ట్ ఉన్నకే సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్తారు.  కళ్యాణ్ కృష్ణ స్క్రిప్ట్ ఏమైందో ఇంకా తెలియదు.  ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలియదు.  అప్పుడే సినిమా సంక్రాంతికి రిలీజ్ కాబోతున్నది అంటున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: