బాహుబలి 2 ప్రపంచవ్యాప్తంగా వసూళ్లు ఏ స్థాయిలో ఉన్నాయో చెప్పక్కర్లేదు.  దాదాపు 2వేల కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసి, ఇండియన్ సినిమా స్టామినాఏంటో చెప్పకనే చెప్పింది.  ఈ సినిమా తరువాత ఆ స్థాయిలో నిర్మితమయ్యే సినిమాలు పెరిగిపోయాయి.  


మార్కెట్ పరిధిని పెంచుకుంటున్నాయి.  అయినా బాహుబలి రికార్డును తెలుగు సినిమా బద్దలు కొట్టలేకపోయింది.  ఇప్పుడు ఈ సినిమాను కలెక్షన్లను బ్రేక్ చేసే సినిమా రాబోతున్నది.  అదే ఆర్ఆర్ఆర్ సినిమా.  ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతున్నది.  


ఎన్టీఆర్, రామ్ చరణ్ లు హీరోలు.  పాన్ ఇండియా మూవీ గా షూట్ చేస్తున్నారు. బాగుంది .  రాజమౌళి దర్శకుడు.  దాదాపు 300 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు.  రాజమౌళి దర్శకుడు కాబట్టి సినిమా తప్పకుండా హిట్ కొడుతోంది.  


పైగా ఇది పీరియాడికల్ స్టోరీ కావడంతో అంచనాలు పెరిగాయి.  సినిమా రిలీజ్ కు ముందు బాహుబలి 2 రికార్డ్ ను బ్రేక్ చేసింది.ఎలాగంటే .. ఈ మూవీ ఓవర్సీస్ హక్కులు 72 కోట్ల రూపాయలు ఫర్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ దక్కించుకుంది.  రిలీజ్ తరువాత తప్పకుండా బాహుబలి రికార్డులు బద్దలు కావడం ఖాయం అని అంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: