‘మన్మధుడు 2’ టీజర్ లో నాగార్జున లుక్ తో పాటు అతడి రొమాంటిక్ సీన్స్ కూడ హాట్ టాపిక్ గా మారి మరొక సంవత్సరంలో షష్టిపూర్తి చేసుకోబోతున్న నాగార్జునలో రొమాంటిక్ యాంగిల్ ఏమాత్రం తగ్గలేదు అన్న కామెంట్స్ వస్తున్నాయి. ఈ కామెంట్స్ నేపధ్యంలో అక్కినేని కుటుంబ హీరోలు లిప్ లాక్ హీరోలుగా ఒక సరికొత్త రికార్డ్ ను క్రియేట్ చేసారు అంటూ కొందరు ఆసక్తికర విశ్లేషణలు చేస్తున్నారు.

అక్కినేని నాగార్జునతో పాటు అతడి కుటుంబానికి చెందిన నాగచైతన్య అఖిల్ సుమంత్ సుశాంత్ - అమల సమంతలు నటించిన అనేక సినిమాలలో ఉన్న లిప్ లాక్ సీన్స్ ఆసినిమాలకు ట్రెండ్ సెటర్స్ గా మారి ఇండస్ట్రీలో లిప్ లాక్స్ విషయంలో అక్కినేని కుటుంబ ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నాయి అంటూ కామెంట్స్ వస్తున్నాయి.
వాస్తవానికి టాలీవుడ్ సినిమాల కలక్షన్స్ రికార్డుల విషయంలో మెగా ఫ్యామిలీ హీరోలు చాలముందు స్థానంలో కొనసాగుతున్నా లిప్ లాక్స్ విషయంలో మాత్రం అక్కినేని కుటుంబ హీరోల ముందు నిలబడలేక పోతున్నారు అంటూ మరికొందరు ఒక సరికొత్త విశ్లేషణ చేస్తున్నారు. 

ఇండస్ట్రీ రికార్డుల పరంగా చిరంజీవి పవన్ లు ఎన్నో రికార్డులు క్రియేట్ చేసినా లిప్ లాక్ విషయంలో అక్కినేని కుటుంబ హీరోల స్పీడ్ ముందు మెగా హీరోలు డామినేట్ చేయలేకపోతున్నారు అన్నది వాస్తవం. దీనితో ఇండస్ట్రీ రికార్డుల విషయంలో చరిత్ర సృష్టించిన చిరంజీవి పవన్ లు మ్యానియా ముందు అక్కినేని హీరోలు నిలబడలేకపోయినా లిప్ లాక్స్ విషయంలో మాత్రం వారి రికార్డులను బ్రేక్ చేయగల శక్తి ప్రస్తుతం ఇండస్ట్రీలోని మరి ఏటాప్ ఫ్యామిలీకి లేదు అంటూ కొందరి కామెంట్స్.

ప్రస్తుతం నాగార్జున తన వయసులో కనీసం సగం కూడ లేని రకుల్ ప్రీత్ తో చేసిన లిప్ లాక్ ఫోటోల సీన్స్ వైరల్ గా మారిన నేపధ్యంలో ఈ కామెంట్స్ వస్తున్నాయి. సీనియర్ టాప్ హీరోలు చిరంజీవి బాలకృష్ణలు తమ వయసుకు తగ్గ పాత్రలను చేస్తూ ప్రేక్షకులను మెప్పించడానికి ప్రయత్నాలు చేస్తుంటే దానికి భిన్నంగా నాగార్జున తన వయసును పక్కకు పెట్టి టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ ‘మన్మధుడు’ అంటే తాను మాత్రమే అంటూ ‘మన్మధుడు 2’ టీజర్ లో ఇచ్చిన సంకేతాలతో నాగ్ కెరియర్ మరో 5 సంవత్సరాలు హీరోగా కొనసాగుతుంది అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి..  
 


మరింత సమాచారం తెలుసుకోండి: