దిగ్గజ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, చెర్రీ కలసి ‘RRR’ సినిమా చేస్తున్న విషయం అందరికీ తెలిసినదే. రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై యావత్ భారతీయ సినిమా ప్రేక్షకులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. డివివి దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్, ఎన్టీఆర్ స్వాతంత్ర పోరాట యోధులుగా కనిపిస్తున్నారు.


స్టోరీ పరంగా చూస్తే ఇది 1920 నాటి స్వాతంత్ర ఉద్యమానికి సంబంధించిన కల్పితకథ అని అప్పట్లో రాజమౌళి మీడియా సమావేశం పెట్టి క్లారిటీ ఇచ్చారు. అయితే ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతా రామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో నటిస్తున్నారు. దీనితో రాంచరణ్, ఎన్టీఆర్ లుక్ ఎలా ఉండబోతోందనే ఆసక్తి ఆడియన్స్ లో ఎక్కువైంది.


తాజా సమాచారం ప్రకారం ఎన్టీఆర్ రాంచరణ్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసేందుకు రాజమౌళి సిద్ధం అవుతున్నారట. స్వాతంత్ర ఉద్యమ వీరుల గురించి తెరకెక్కిస్తున్న సినిమా కాబట్టి ఆగష్టు15న ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తే బావుంటుందనే అభిప్రాయానికి రాజమౌళి వచ్చినట్లు తెలుస్తోంది. మొత్తం మీద మెగా అభిమానులకు నందమూరి అభిమానులకు ఇద్దరి హీరోల ఫస్ట్ లుక్ తో పెద్ద ట్రీట్ రాజమౌళి ఇవ్వటానికి రెడీ అయినట్లే అని తెలుస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: