సినిమా ఇండస్ట్రీలో ఏదైనా ఒకటి జరిగింది అంటే దానిని పట్టుకొని వరసగా అనేకం జరుగుతూనే ఉన్నాయి.  సీనియర్లు మరణం ఇలానే జరిగింది.  ఒకరి తరువాత మరణించడం అప్పట్లో పెద్ద సంచలనం అయ్యింది.  దానిని నివారించేందుకు యాగం కూడా చేశారు.  కొంతకాలం బాగానే ఉంది.  


ఇప్పుడు మరలా  అదే విధంగా మారుతుందేమో అనిపిస్తోంది.  వరుణ్ తేజ్ కారు యాక్సిడెంట్ యాక్సిడెంట్ కావడం, ఆ తరువాత ఛలో హీరో  నాగ శౌర్య కాలుకు గాయం కావడం, ఆ మరుసటి రోజే సందీప్ కిషన్ షూటింగ్ లో గాయం కావడంతో హాస్పిటల్ లో  జాయిన్ అయ్యారు.  


తాజాగా శర్వానంద్ 96 సినిమా షూటింగ్ సమయంలో స్కై డైవింగ్ చేసే సమయంలో ఈ ప్రమాదం జరిగింది.  భుజానికి, కాలికి గాయాలయ్యాయి.  వెంటనే హుటాహుటిన హైదరాబాద్ లోని సన్షైన్ హాస్పిటల్ కు  తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు.  మరో నాలుగు  రోజులపాటు హాస్పిటల్ లో ఉండాలని చెప్పారట.  


ఇలా వరసగా యువ హీరోలకు గాయాలు కావడంతో ఇబ్బందులు పడుతున్నారు.  ఇలాంటివి ఇంకా ఎన్ని చూడాల్సి వస్తుందో అని భయపడుతున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: