టాలీవుడ్ హీరోలకు ఏదో శనిగ్రహం పట్టుకున్నట్టు కనిపిస్తోంది. వరుసపెట్టి యంగ్ హీరోలు షూటింగ్‌లు, ప్రయాణాల్లో ప్రమాదాలకు గురయ్యి... తీవ్ర గాయాలపాలవుతున్నారు. ఇటీవల వరుసగా నాగశౌర్య, సందీప్ కిషన్ తృటిలో పెద్ద ప్రమాదాల నుంచి తప్పించుకున్నారు. నేచురల్ స్టార్ నానికి కూడా షూటింగ్లో కాలుకు గాయాలు అయ్యాయి. అందుకే నాని రెస్ట్‌లో ఉన్నాడని అంటున్నారు. ఇక వరుణ్‌తేజ్ కూడా రోడ్డు ప్రమాదంలో తృటిలో తప్పించుకున్న సంగతి తెలిసిందే.
కొద్ది రోజుల క్రితం కోలీవుడ్ హీరో విశాల్‌కు కూడా గాయాలు అయ్యి చేతికి ప్రాక్చర్ అయ్యింది. ఇక ఇప్పుడు లేటెస్ట్గా హీరో శర్వానంద్ కు మాత్రం గట్టి ప్రమాదం జరిగిందని, తీవ్రంగా గాయపడ్డారని తెలుస్తోంది. కోలీవుడ్ హిట్ మూవీ 96ను ప్రముఖ నిర్మాత దిల్ రాజు రీమేక్ చేస్తున్నారు. బ్యాంకాంగ్‌లో షూటింగ్ జరుగుతోన్న టైంలో స్కై డైవింగ్ సీన్ల చిత్రీకరణ కోసం ప్రాక్టీస్ చేస్తున్నారట.
ఈ ప్రాక్టీస్‌లో భాగంగా శర్వానంద్ మూడు సార్లు కిందకు బాగానే ల్యాండ్ అయినా ఫైనల్ ప్రాక్టీస్ డైవింగ్ చేసే క్రమంలో సముద్రం ఒడ్డున గాలి విపరీతంగా వీయడంతో కాళ్లకు బదులుగా శర్వా షోల్డర్ మీద ల్యాండ్ అవ్వడంతో కాలికి తీవ్రమైన గాయం అయినట్టు తెలిసింది. వెంటనే ఫ్లయిట్లో హైదరాబాద్‌కు తీసుకువచ్చి ఓ ప్రముఖ కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్టు తెలుస్తోంది. చిన్నపాటి సర్జరీతో పాటు నాలుగైదు వారాలు విశ్రాంతి అవసరమని టాలీవుడ్ టాక్. ఏదేమైనా హీరోలు షూటింగ్లలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఈ వరుస సంఘటనలు చెపుతున్నాయి.