బాలీవుడ్ బాదుషా మరోసారి మహిళలపై తన ప్రేమను చాటుకున్నారు. అంతర్జాతీయ పితృ దినోత్సవం రోజు ఒక తండ్రిగా, భర్తగా, అన్నగా మన బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కష్టాల్లో ఉన్న మహిళలకు సాయం చేసేందుకు తన తండ్రి ‘మీర్ తాజ్ మొహమ్మద్ ఖాన్’ పేరిట ఓ ఫౌండేషన్ ను ప్రారంభించారు. దీనికి మీర్ ఫౌండేషన్ గా నామకరణం చేశారు.

 

అంతర్జాతీయ పితృ దినోత్సవం సందర్భంగా ఫౌండేషన్ వెబ్ సైట్ ను షారుక్ ఖాన్ ఆవిష్కరించారు. కుటుంబ కలహాలు, న్యాయ సహాయం, వైద్యం తదితర రంగాల్లో మహిళలకు తమ ఫౌండేషన్ సహాయసహకారాలు అందిస్తుందని కింగ్ ఖాన్ షారుక్ తెలిపారు. తన తండ్రి స్ఫూర్తితో మహిళా సాధికారతకు కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ మేరకు షారుక్ ఖాన్ ట్విట్టర్ లో స్పందించారు.

 

షారుఖ్ ప్రముఖ నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ ఎంటర్ టైన్మెంట్ కు ఆయన సహ చైర్మన్ గానూ, ఇండియన్ ప్రీమియర్ లీగ్ లోని కోల్‌కత నైట్ రైడర్స్ టీంకు సహ యజమానిగా ఉన్నారు. ఆయన ఇప్పటికీ టీవీ షోలలో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తుంటారు. ఎన్నో వ్యవస్థాపక వెంచర్లు చేస్తున్నందున మీడియా ఆయనను "బ్రాండ్ ఎస్.ఆర్.కె"గా వ్యవహరిస్తుంటుంది. అనారోగ్యాల అవగాహన ప్రచారంలోనూ, విపత్తులు సంభవించినప్పుడు ఆయన దాతృత్వం చెప్పుకోదగ్గది. పిల్లల చదువు ఆవశ్యకతా ప్రచారంలో ఆయన చేసిన కృషికి గుర్తింపుగా 2011లో  యునెస్కో పిరమిడ్ కాచ్ మర్నీ పురస్కారంతో గౌరవించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: