ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఎన్నో సంచ‌ల‌నాల‌కు వేదిక అయిన బిగ్ బాస్ షో తెలుగులో కూడా సూప‌ర్ హిట్ అయ్యింది. తెలుగు వెర్ష‌న్‌లో తొలి రెండు సీజ‌న్లు ప్రేక్ష‌కుల‌ను బాగా అల‌రించ‌డంతో పాటు స్టార్ మా ఛానెల్ రేటింగుల రికార్డులు బ‌ద్ద‌లు కొట్టాయి. ఇక తొలి సీజ‌న్‌కు హోస్ట్‌గా ఉన్న ఎన్టీఆర్ బిగ్ బాస్‌ను హోరెత్తించాడు. ఆ త‌ర్వాత రెండో సీజ‌న్‌కు హోస్ట్‌గా ఉన్న నేచుర‌ల్ స్టార్ నాని త‌న‌దైన శైలీలో షోకు వ‌న్నె తెచ్చాడు.


ఇక ఇప్పుడు మూడో షో నిర్వ‌హ‌ణ‌కు స్టార్ మా ఛానెల్ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఈ మూడో సీజ‌న్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ? అన్న దానిపై ఇప్ప‌టికే చాలా సందేహాలు ముసురుకున్నాయి. దీంతో బిగ్ బాస్ యాజ‌మాన్యం స్ప‌ష్ట‌మైన క్లారిటీ ఇచ్చింది. బిగ్ బాస్ 3 సీజ‌న్‌కు సంబంధించి గుడ్ న్యూస్ ఇచ్చేసింది. బిగ్ బాస్ 3 సీజ‌న్‌కు సంబంధించి ఓ ప్రోమోను విడుదల చేశారు. 


ఈ సారి బిగ్ బాస్ తొలి రెండు సీజ‌న్ల‌తో పోలిస్తే మ‌రింత కొత్త‌గా ఉండ‌బోతోంద‌న్న‌దానిపై క్లారిటీ వ‌చ్చేసింది. ఇప్పటికే ఈ షోలో కొంతమంది పాల్గొనబోతున్నారని, దానికి సంబంధించిన ఓ లిస్ట్ ఒక‌టి సోష‌ల్ మీడియాలో జోరుగా ట్రెండ్ అవుతోంది. ఈ లిస్టు ప్ర‌కారం టిక్‌టాక్‌ స్టార్లు, యూట్యూబ్‌ స్టార్లు, సింగర్లు, యాంకర్లు ఇలా ప్రతి ఒక్క క్యాటగిరీ నుంచి టాప్‌ సెలబ్రెటీలు పాల్గొనబోతున్నారని తెలుస్తోంది. 


ఇక ఈ షోకు టాలీవుడ్ కింగ్ నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరించున్నారని సమాచారం. నాగార్జున ఇప్ప‌టికే మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు షోతో తెలుగు బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను సూప‌ర్బ్‌గా రంజింప‌చేశారు. ఇప్పుడు సంచ‌ల‌నాల‌కు వేదిక అయిన బిగ్ బాస్ -3కు హోస్ట్‌గా అంతే సంచ‌ల‌నాలు క్రియేట్ చేయిస్తాడ‌నంలో సందేహం లేదు.



మరింత సమాచారం తెలుసుకోండి: