టాలీవుడ్ దర్శకులలో వెరైటీ స్టైల్ ఆఫ్ మేకింగ్ తో తనకంటూ కొంత వైవిధ్యమైన సినిమాలు తీసే దర్శకుడిగా పేరుతెచ్చుకున్నారు సుకుమార్. తోలి చిత్రం ఆర్య నుండి మొన్నటి రంగస్థలం వరకు సుకుమార్ మేకింగ్ స్టైల్ చూస్తే ఆయన సినిమాల్లోని ప్రత్యేకత మనకు అర్ధం అవుతుంది. అయితే అందులో సక్సెస్ లు ఫెయిల్యూర్స్ రెండు వున్నాయనుకోండి. ఇకపోతే ఇటీవల తన తరువాత సినిమాను సూపర్ స్టార్ మహేష్ తో తీద్దాం అనుకున్న సుకుమార్ ప్లాన్స్ తలక్రిందులయ్యాయి. 

సుకుమార్ గారితో కొన్ని క్రియేటివ్ డిఫరెన్సెస్ వలన అయనతో సినిమా చేయలేకపోతున్నాను, భవిష్యత్తులో తనతో కలిసి ఒక మంచి సినిమా తప్పకుండా చేస్తాను అంటూ మహేష్ బాబు ఇటీవల బహిరంగంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక ఆ ఘటన తరువాత సుకుమార్ బన్నీ దగ్గరకు వెళ్లి ఒక కథ వినిపించడం, అది నచ్చిన బన్నీ దానిని వెంటనే ఓకే చేయడం జరిగిపోయాయి. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమాపై టాలీవుడ్ లో మంచి అంచనాలున్నాయి. నిజానికి మహేష్ కు చెప్పిన కథనే సుకుమార్, బన్నీ కి చెప్పారని ఒక వార్త ఆమధ్య ప్రచారం అయింది. ఆ కథ ఒక ఎమోషనల్ బ్యాక్ డ్రాప్ లో సాగుతుందని, మంచి స్క్రీన్ ప్లే బేస్డ్ కథని, 

అయితే దానిలో తాను ఆశించిన ఎంటర్టైన్మెంట్ అంశాలు లేకపోవడంతో మహేష్ దాన్ని రిజెక్ట్ చేసారు అనేది ప్రచారమైన ఆ వార్త సారాంశం. అసలు అది నిజమా కాదా అనే విషయం అటుంచితే, బన్నీ తో సుక్కు చేయబోయే సినిమా మాత్రం పక్కా హిట్ ఫార్ములాతో సాగె స్క్రీన్ ప్లే బేస్డ్ మూవీ అని, రంగస్థలంతో తనను తాను ప్రూవ్ చేసుకున్న సుకుమార్, ఈ సినిమాతో మరొక భారీ హిట్ కొట్టడం ఖాయమని ఆ చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తున్నట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. ఒకవేళ వారు భావిస్తున్నట్లు ఆ సినిమా మంచి హిట్ ఫార్ములా సినిమా అయితే, అటు సుకుమార్ కు, ఇటు బన్నీకి సూపర్ హిట్ లభించినట్లే మరి....!!


మరింత సమాచారం తెలుసుకోండి: