టాలీవుడ్ రంగుల ప్రపంచంలో ఏదో సాధించలన్న కసితో చాలా మంది యువతరం ఎన్నో ఆశలతో ఇక్కడ అడుగు పెడుతూ ఉంటుంది. ఇక్కడ అడుగు పెట్టిన కొన్ని రోజులకే వారికి అసలు రంగు తెలిసిపోతుంది. ఇక్కడ కనిపించే రంగుల ప్రపంచం వెనక ఎదగాలంటే అది టాలెంట్ ఒక్కటే ఉంటే సరిపోదని అర్థమవుతుంది. ఇక్కడ టాలెంట్ ఉన్న వారికే అవకాశాలు వస్తాయి... వారు సక్సెస్ అవుతారు అనుకోవడం అత్యాశే. ఇక్కడ ఉండాలంటే టాలెంట్ ఒక్కటే సరిపోదు.. దాని వెనక చాలా కథలు ఉంటాయి.
ఇప్పుడు సక్సెస్ రేటులో ఉన్న దర్శకులను పక్కన పెడితే ఛాన్సులు రాకుండా ఎంతో టాలెంట్ ఉన్న వారు కూడా ఇండస్ట్రీలో కోకొల్లుగా ఉన్నారు. ఈ క్రమంలోనే కొందరు షార్ట్ ఫిల్మ్స్ ద్వారా తమ టాలెంట్ నిరూపించుకుని సినిమాల్లో ఛాన్సుల కోసం కష్టాలు పడుతున్నారు. ఈ షార్ట్ ఫిల్మ్‌ల కోసం కూడా నిర్మాతల కోసం వారు పడని పాట్లు లేవు. ఇలా తన ప్రతిభను నిరూపించుకుంటోన్న ఓ యంగ్ షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ గోదావరి ఊబిలో చిక్కుకుని, తన తోటి కెమేరామెన్‌తో సహా గల్లంతైన సంఘటన తూర్పుగోదావరి జిల్లాలో జరిగింది.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం సినిమాల్లో డైరెక్టర్ ఛాన్సుల కోసం ప్రయత్నాలు చేస్తోన్నషార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ సుధీర్ (33), అతడి స్నేహితుడు అయిన కెమేరామెన్ కార్తీక్ (35) షార్ట్ ఫిల్మ్ లొకేషన్ కోసం కోనసీమకు వెళ్లారు. అక్కడ తూర్పుగోదావరి జిల్లాలోని ఆత్రేయపురం మండలం బొబ్బర్లంక... పిచుకులంక పరిసరాల్లో
స్నానానికి దిగారు. వీరు స్నానం చేస్తూ ఊబిలో కూరుకుపోయి మృతి చెందారు. ఈ రంగుల ప్రపంచంలో ఎన్నో ఆశలతో ఓ వెలుగు వెలగాలని ఎన్నో ఆశలతో వచ్చి... ముందుగా షార్ట్ ఫిల్మ్స్ ద్వారా టాలెంట్ నిరూపించుకునే క్రమంలోనే వీరు అనంత లోకాలకు చేరిపోయారు.