ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి లేటెస్ట్ సినిమా ఆర్ ఆర్ ఆర్‌. బాహుబ‌లి సీరిస్ సినిమాల త‌ర్వాత రాజ‌మౌళి నేష‌న‌ల్ డైరెక్ట‌ర్‌గా కాకుండా ఇంట‌ర్నేష‌న‌ల్ రేంజుకు ఎదిగిపోయాడు. ఇప్పుడు రాజ‌మౌళి నుంచి ఓ సినిమా వ‌స్తుందంటే ఇండియ‌న్ సినిమా ప్రియులే కాకుండా, విదేశాలు ముఖ్యంగా అమెరికా, చైనా, అర‌బ్ దేశాల సినిమా ప్రేక్ష‌కులు కూడా ఎంతో ఆస‌క్తితో వెయిటింగ్‌లో ఉన్నారు. ఈ క్రెడిట్ సొంతం చేసుకున్న రాజ‌మౌళికి ముందుగా మ‌నం హ్యాట్సాప్ చెప్పాల్సిందే.


ఇక వ‌చ్చే యేడాదిలో విడుద‌ల‌వుతోన్న ఆర్ ఆర్ ఆర్ సినిమాకు సంబంధించి అప్పుడే బిజినెస్ ఎంక్వైరీలు స్టార్ట్ అవ్వ‌డంతో పాటు కొన్ని ఏరియాల‌కు డీల్స్ కూడా క్లోజ్ అయిపోతున్నాయి. ఈ సినిమా ఓవ‌ర్సీస్ రైట్స్‌ను దుబాయ్‌కు చెందిన ఓ డిస్ట్రిబ్యూష‌న్ సంస్థ ఏకంగా రూ. 72 కోట్ల‌కు సొంతం చేసుకున్న‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. ఇదిలా ఉంటే నైజాం ఏరియాకు అదిరిపోయే ఫార్ వ‌చ్చిన‌ట్టు టాక్‌.


నైజాం ఏరియాకు ఆర్ ఆర్ ఆర్ రేంజ్ సినిమా కొనాలంటే అది దిల్ రాజు, ఏసియ‌న్ సునీల్ లాంటి వాళ్ల‌కు మాత్ర‌మే సాధ్య‌మ‌వుతుంది. వీరిద్ద‌రు ఈ సినిమా రైట్స్ కోసం విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్టు తెలిసింది. నైజాం హ‌క్కుల కోసం వీళ‌ల్లో ఒక‌రు రూ.70 కోట్లు కోడ్ చేస్తే.. మ‌రొక‌రు రూ.80 కోట్లు కోడ్ చేసిన‌ట్టు తెలుస్తోంది. ఒక్క నైజాంలో రూ.80 కోట్ల డీల్ అంటే విన‌డానికే క‌ళ్లు చెదిరిపోయేలా ఉంది. 


ఇటీవ‌ల మ‌హ‌ర్షి సినిమాకు తెలంగాణ‌లో రేట్లు పెంచుకునేందుకు అక్క‌డి ప్ర‌భుత్వం అనుమ‌తులు ఇచ్చింది. ఈ లెక్క‌న ఈ సినిమా యూనిట్తో పాటు దిల్ రాజు లాంటి వాళ్ల‌కు తెలంగాణ ప్ర‌భుత్వంతో ఉన్న అనుబంధం నేప‌థ్యంలో రేట్లు పెంచుకునే వెసులు బాటు ఉంటే సినిమాకు ఉన్న క్రేజ్ నేప‌థ్యంలో భారీ వ‌సూళ్లు ఖాయ‌మే. అయితే మ‌రీ రూ.80 కోట్లు అంటే చాలా ఎక్కువే.



మరింత సమాచారం తెలుసుకోండి: