లేటెస్ట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూ లో భాగంగా.. సినిమాల్లో నటించాలనేది నా చిన్నప్పటి కోరిక. సినిమాలు కాకపోతే ఏమిటి? అనేదాని గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. నా చాయిస్‌ ఎప్పుడూ సినిమాలే! సినిమాలే లోకంగా ఉండడం కావచ్చు...‘సినిమాల్లో నటించాలి’ అనే కోరిక బలంగా పెరిగింది. శ్రీదేవి అద్భుతమైన నటన, మాధురి దీక్షిత్‌ తిరుగులేని నాట్యం...నాకు బాగా ఇష్టం. సినిమాలో ఒక డైలాగు కావచ్చు, పాట కావచ్చు...అద్దం ముందు నిల్చొని వారిని ఆవాహన చేసుకునేదాన్ని.

 

ఇంకా.. హీరోయిన్ కైరా, చాలా మెట్యూర్డ్ ఫిలాసఫీ చెప్పింది.  అదేమిటంటే.. జీవిత పరమావధి అంటే నా దృష్టిలో  ఆస్తులు, అంతస్తులు, కీర్తి కాదు. ఎప్పుడూ సంతోషంగా ఉండడం, చుట్టూ ఉన్న వాళ్లను సంతోషంగా ఉంచే ప్రయత్నం చేయడం. సంతోషం మన వెంట ఉంటే కొత్త విజయాలు సాధించవచ్చునని నమ్ముతాను. నా విషయానికి వస్తే... పనిలోనే సంతోషాన్ని వెదుక్కుంటాను. ‘ఫలనా పని చేయబోతున్నాను. ఫలితం ఎలా ఉంటుందో ఏమో’ అని ఆలోచిస్తూ ఒత్తిడికి గురికాను. కష్టానికి మాత్రమే మొదటి ప్రాధాన్యత ఇస్తాను... ఫలితం సంగతి తరువాత! అని చాలా గొప్పగా మాట్లాడింది.

 

ఇంకా.. మనలోని ప్రతిభ వెలుగులోకి రావాలంటే, అవకాశం, అదృష్టం కూడా కలిసి రావాలనేది నమ్ముతాను. సినిమా అనేది సమాజానికి దర్పణంలాంటిది. సమాజంలోని సంఘటనలు, సామాజిక ధోరణులు సినిమాల్లో ప్రతిబింబిస్తాయి. బలమైన వ్యక్తిత్వం ఉన్న స్త్రీ పాత్రలు పోషించాలని ఉంది. ఏది ఎప్పుడు వర్కవుట్‌ అవుతుందో ఎవరికీ తెలియదు. అలా అని విధిపై భారం వేయలేము కదా! అందుకే స్క్రిప్ట్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను. తొలి సీన్‌ నుంచి చివరి సీన్‌ వరకు శ్రద్ధగా వింటాను. ఒక ప్రేక్షకురాలిగా అందులో పూర్తిగా లీనమైపోతాను.

 

ప్రతి రంగంలో మంచీచెడూ ఉంటాయి. ఒకేవైపు చూస్తే  ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేము. ‘బయోపిక్‌’లలో నటించాలనే కోరిక ఉంది. నా మొదటి ప్రాధాన్యత...మధుబాల బయోపిక్‌.  ఈ సినిమా ద్వారా ఆమె వ్యక్తిగత జీవితం చలనచిత్ర జీవితం కళ్లకు కట్టినట్లుగా ఉండాలని పేర్కొన్నారు. ‘భరత్‌ అనే నేను’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ‘వినయ విధేయ రామ’తో మరోసారి పలకరించిన కియారా, తెలుగులో ఘనవిజయం సాధించిన ‘అర్జున్‌రెడ్డి’కి హిందీలో రిమేక్‌గా వస్తున్న ‘కబీర్‌సింగ్‌’లో కథానాయిక.


మరింత సమాచారం తెలుసుకోండి: