Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, Jul 16, 2019 | Last Updated 3:47 pm IST

Menu &Sections

Search

`మ‌ల్లేశం`

`మ‌ల్లేశం`
`మ‌ల్లేశం`
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ప‌ద్మ శ్రీ చింత‌కింది మ‌ల్లేశం జీవితం ఆధారంగా తెర‌కెక్కిన సినిమా `మ‌ల్లేశం`. అగ్గిపెట్టెలో ప‌ట్టేంత చిన్న చీర‌ల‌ను కూడా నేచి ప్రపంచాన్ని అబ్బుర పరిచిన వ్యక్తి మల్లేశం. తను సాధించిన విజయాలతో చేనేత ప్రాముఖ్యతను దేశవ్యాప్తంగా చాటి చెప్పిన ఘ‌న‌త మ‌ల్లేశంగారి సొంతం. ఇలాంటి గొప్ప వ్యక్తి జీవితం ఆధారంగా `మ‌ల్లేశం` సినిమా తెర‌కెక్కింది. రాజ్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశారు. శ్రీ అధికారి, రాజ్.ఆర్ నిర్మించారు. ఇందులో మ‌ల్లేశం పాత్ర‌లో ప్రియ‌ద‌ర్శి నటిస్తున్నారు. అన‌న్య‌, ఝాన్సీ, చక్ర‌పాణి కీల‌క‌పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఈ చిత్రం జూన్ 21న విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా శ‌నివారం జ‌రిగిన ప్రాత్రికేయుల స‌మావేశంలో..


తెలంగాణ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.ఆర్ మాట్లాడుతూ - ``మ‌ల్లేశం సినిమాను పూర్తి చేయ‌డంలో సూర్యుల్లాగా చాలా మంది ప‌నిచేశారు. వారంద‌రినీ అభినంద‌న‌లు. సినిమా చాలా హృద్యంగా, చాలా మాన‌వీయంగా, స‌హ‌జంగా, అద్భుతంగా మాన‌వ ఉద్వేగాలను చ‌క్క‌గా క్యాప్చ‌ర్ చేశారు. సినిమాలో `సముద్ర గ‌ర్భంలో దాగిన బ‌డ‌బాగ్నులెన్నో, స‌మాజంలో అజ్ఞాత సూర్య‌లెంద‌రో, గాయ‌ప‌డిన క‌వి గుండెల్లో రాయ‌బ‌డ‌ని క‌విత‌లెన్నో` అనే ఓ క‌విత సినిమాలోని రెండు గంట‌ల ఎమోష‌న్‌ని, ప్ర‌యాస‌ని, కృషి, సామాన్యుడి ప్ర‌తిభా పాట‌వాన్ని ఆవిష్క‌రించే క్ర‌మంలో ఎన్ని క‌ష్ట‌న‌ష్టాలుంటాయో తెలియ‌జేసింది. సినిమాలో మూడు నాలుగు అంశాలు నా హృద‌యానికి చాలా ద‌గ్గ‌ర‌య్యాయి. భార‌త‌దేశంలోని అంద‌రూ చేనేత కార్మికులు ప‌డే క‌ష్టం మ‌రుగున ప‌డిపోతున్న క‌ళ‌గా అంత‌రించిపోతున్న త‌రుణంలో వారి నైపుణ్యానికి పెద్ద పీట వేస్తూ వారి క‌ష్ట‌న‌ష్టాల‌ను కూడా ఈ సినిమాలో ప్ర‌స్తావించారు. చేనేత క‌ళాకారుల ఆత్మ‌హ‌త్య‌ల‌ను, స్థితిగ‌తుల‌ను చూపెడుతూ, ఈ వృత్తిలో రాణించాలంటే ఉండే క‌ష్ట‌న‌ష్టాల‌ను చూపుతూ, అందులో భాగంగా ఓ రూర‌ల్ ఇన్‌వెంట‌ర్ జీవితాన్ని చూపించారు. ఒక కొత్త ఆవిష్క‌ర‌ణ‌ను చేయాల‌నుకున్న‌ప్పుడు ఓ వ్య‌క్తికి ఎన్ని ర‌కాల ఇబ్బందులు ఎదుర‌వుతాయి. దాన్ని త‌ట్టుకుని అధిగ‌మిస్తూ ఎలా స‌క్సెస్ కావాల‌నే దానికి కూడా ఈ సినిమా అద్భుత‌మైన ప్రేర‌ణ‌గా నిలిచింది.

ప‌ద్మ‌శ్రీ చింత‌కింది మ‌ల్లేశం గారికి, చేనేత క‌ళాకారుల‌కి, తెలంగాణ ప్ర‌భుత్వం గ‌డిచిన ఐదు సంవ‌త్స‌రాలుగా భార‌త‌దేశంలో ఏ ప్ర‌భుత్వం చేయ‌నన్ని అద్భుత‌మైన కార్య‌క్ర‌మాలు చేసింది. చింతకింది మ‌ల్లేశం గారికి మ‌రో యూనిట్‌ను స్టార్ట్ చేయ‌డానికి తెలంగాణ ప్ర‌భుత్వం కోటి రూపాయ‌ల ఆర్ధిక సాయాన్ని చేసింద‌నే సంగ‌తిని ఈ సంద‌ర్భంగా తెలియ‌జేస్తున్నాను. దాంతో పాటు.. అప్ప‌టి వ‌ర‌కు జౌళి శాఖ‌కు రూ.70కోట్ల మాత్ర‌మే ఉండే బ‌డ్జెట్‌ను రూ.1270 కోట్లకు పెంచి ఘ‌న‌త ముఖ్య‌మంత్రి కె.సి.ఆర్‌గారికే చెందుతుంది. ఇంకా చేనేత క‌ళాకారుల స‌మ‌స్య తీరిపోలేదు. సినిమా విష‌యానికి వ‌స్తే చాలా ఎమోష‌న్స్‌ను చ‌క్క‌గా క్యాప్చ‌ర్ చేశారు. ఇంగ్లీష్‌లో నెసిసిటీ ఈజ్ మ‌ద‌ర్ ఆఫ్ ఇన్‌వెన్‌ష‌న్ అనే సామెత ఉంది. కానీ ఈ సినిమాలో మ‌ద‌ర్ ఈజ్ నెసిసిటీ ఆఫ్ ఇన్‌వెన్‌ష‌న్ అని చూపించారు. ఎందుంక‌టే మ‌ల్లేశంగారు త‌న త‌ల్లిగారి క‌ష్టాన్ని చూసి శోధించి క‌నుగొన్నారు. ఆ ర‌కంగా త‌న త‌ల్లికే కాదు.. ఎంతో మంది త‌ల్లుల స‌మ‌స్య‌ను ఆయ‌న తొలగించిన విష‌యాన్ని అద్భుతంగా చూపించారు. ఇలాంటి అజ్ఞాత సూర్యులంద‌రికీ, సోష‌ల్ ఇన్నోవేట‌ర్స్‌కి, యంగ్ ఇన్నోవేట‌ర్స్‌కి, మ‌నం వెళ్లే దారిలో ఎన్నో స‌మ‌స్య‌లుంటాయి. అన్ని దారులు మూసుకుపోయినా, ఏదో ఒక‌దారి తెరుచుకుని ఉంటుందనే విష‌యాన్ని చ‌క్క‌గా వివ‌రించింది. ఈ సినిమా ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు, ఇత‌ర యూనిట్ అభినంద‌న‌లు. ప్రియ‌ద‌ర్శి లీడ్ క్యారెక్ట‌ర్‌లో అద్భుతంగా న‌టించారు. ఆయ‌న‌కు అభినంద‌నలు. అలాగే రైట‌ర్ అశోక్‌కుమార్‌గారు తెలంగాణ భాష‌, యాస‌లోని మాధుర్యాన్ని చ‌క్క‌గా రాశారు. ఎక్క‌డా తొట్రుపాటు లేకుండా, కృత‌కంగా లేకుండా చ‌క్క‌గా యధాలాపంగా ప‌లికారు. ఈ సినిమాకు ప్ర‌భుత్వం నుండి స‌హకారం ఎంతో అవ‌స‌రం. ఆ స‌హ‌కారాన్ని అందించాల‌ని గౌర‌వ సినిమాటోగ్రాఫ‌ర్ మంత్రిగారితో , గౌర‌వ ముఖ్య‌మంత్రిగారితో మాట్లాడుతాను. ప‌ది మందికి ఈ సినిమాను చేర్చేలా చేయాల్సిన స‌హ‌కారం అది ట్యాక్స్ ఎగ్జంప్ష‌న్ అయినా, మ‌రేదైనా నా వంతుగా ఉడ‌తా భ‌క్తిగా చేయ‌డానికి ప్ర‌య‌త్నిస్తాన‌ని చెబుతున్నాను. హ్యాండ్ లూమ్ ప్ర‌మోష‌న్స్‌ను చాలా మంది చారిటీకోసం అనుకుంటారు. ప్ర‌తి సోమ‌వారం చేనేత వ‌స్త్రాల‌నే ధ‌రించాలి. చేనేత క‌ళాకారుల‌కు అండ‌గా నిల‌బ‌డాల‌నే ప్ర‌య‌త్నాన్ని ప్రార‌భించిన సంగతి తెలిసిందే. చాలా మంది ఐటీ కుర్రాళ్లు కూడా వారి వంతుగా స‌హాయం చేస్తున్నారు. ఈ ప్ర‌య‌త్నంలో మేం కొంత మేర విజ‌యం సాధించాం. నా విజ్ఞ‌ప్తి ఏంటంటే ఈ సినిమా ద్వారా హ్యాండ్ లూమ్‌కి కూడా కొంత ప్ర‌మోష‌న్ దొరికి చేనేత క‌ళాకారుల బిజినెస్ కూడా పెరిగితే, నేను కూడా ఎంతో సంతోషిస్తాను. చేనేత క‌ళాకారుల‌కు ప్ర‌భుత్వ పరంగా ఎంతో కొంత చేసినా, అంద‌రూ వారికి స‌పోర్ట్‌గా ముందుకు రావాల‌ని విజ్ఞ‌ప్తి చేస్తున్నాను. స‌హ‌జ‌త్వానికి ద‌గ్గ‌ర‌గా ఉండే సినిమాను చేసిన‌, నాకు చూసే అవ‌కాశాన్ని క‌లిగించిన అంద‌రికీ థాంక్స్‌`` అన్నారు.


నిర్మాత డి.సురేష్ బాబు మాట్లాడుతూ - ``రాజ్‌, వెంక‌ట్ ఈ సినిమాను నాకు చూపించారు. ఆయ‌న ప్యాష‌న్ చూసి నేను భ‌య‌ప‌డ్డాను. మార్కెట్ ఎలా ఉంటుందనే విష‌యంలో ఎవ‌రూ రారేమో అని కూడా అన్నాను. అమెరికాలో ఉండే రాజ్‌గారు సినిమాల‌పై ప్యాష‌న్‌తో 6వ త‌ర‌గ‌తి ఫెయిలై వ్య‌క్తి జీవితాన్ని ఆధారంగా చేసుకుని ఓ సినిమా చేశారు. ప్ర‌తి ఒక్క‌రూ ఈ సినిమాను చూడాలి. థియేట‌ర్‌కు బ‌య‌ట‌కు వ‌చ్చేట‌ప్పుడు ఓ ఫీల్‌తో బ‌య‌ట‌కు వ‌స్తారు. ఇలాంటి సినిమాల‌ను ఎంక‌రేజ్ చేస్తేనే బెట‌ర్ సినిమాలువ‌స్తాయి. దాని వ‌ల్ల బెట‌ర్ సొసైటీ రూపొందుతుంది`` అన్నారు.


న‌ర్సింగ్ రావు మాట్లాడుతూ - ``రాజ్‌కు అభినంద‌న‌లు. సామాన్యుడు మ‌ల్లేశం జీవితాన్ని క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లు సినిమాను తెర‌కెక్కించారు. ఈ సినిమాకు స‌పోర్ట్ చేసిన సురేష్‌బాబుగారు స‌హా అంద‌రినీ అభినందిస్తున్నాను. ఐదారేళ్లుగా మ‌న సినిమాల్లో స‌హ‌జ‌త్వం పెరుగుతుంది. ఎంటైర్ యూనిట్‌కు కంగ్రాట్స్‌`` అన్నారు


డైరెక్ట‌ర్ రాజ్ మాట్లాడుతూ - ``నేను మ‌ల్లేశంగారి వీడియో చూసి నేను ఇన్‌స్పైర్ అయ్యాను. ఇందులో రూర‌ల్ ఇన్నోవేష‌న్‌, హ్యాండ్ లూమ్స్ స‌మ‌స‌స్య‌లు, హ్యుమ‌న్ మోటివేష‌నల్ స్టోరీ ఉంది. అందుక‌నే ఈ సినిమాను చేశాం. పెద్దింటి అశోక్‌గారు చాలా మంచి డైలాగ్స్ ఇచ్చారు. మంచి టీం కుదిరింది. శ్రీ కో ప్రొడ్యూస‌ర్‌, వెంక‌ట్ సిద్ధారెడ్డి మా టీంకు సి.ఇ.ఒగా పినిచేశారు. చ‌క్ర‌పాణిగారు, ఝాన్సీ, అన‌న్య‌, ప్రియ‌ద‌ర్శిల‌కు స్పెష‌ల్ థాంక్స్‌`` అన్నారు.


priyadarshi
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
బుజ్జి బంగారం అంటున్న కార్తికేయ‌!
ఐసిసీకి అదిరిపోయే పంచ్‌
ఒక్క పోస్ట్  లో టాప్ లిస్ట్‌లోకి ప్రియాంక
‘ఓ బేబీ’ విజ‌యం అమ్మ, అమ్మమ్మకు అంకితం – మాటల రచయిత లక్ష్మీ భూపాల్‌
యూత్ ను ఆకట్టుకుంటొన్న  "కెఎస్100"
ఆఖ‌రి షెడ్యూల్ లో  `సుంద‌రాంగుడు` 
కులానికి అతీతంగా పెళ్లాడిన వంగ‌వీటి రంగా!
నిర్మాత‌ల‌ను త‌న చుట్టూ తిప్పుకున్న రాజ‌నాల‌...
వీరి మ‌ర‌ణాలు ఎప్ప‌టికీ మిస్ట‌రీలేనా...!
బికినీతో ఈషా రెబ్బా
నానా లాస్ రానా గెయిన్‌
వనవాసం పెద్ద హిట్ అవుతుందని నమ్ముతున్నాను - అల్లరి నరేష్.
ఎమోష‌న‌ల్ సీన్స్ అంద‌రి మ‌న‌సును క‌దిలించాయి - హీరోయిన్ అన్యా సింగ్
గడీల నేపథ్యంలో ప్రేమకథ అందరినీ ఆకట్టుకుంది....  నిర్మాతలు
బైలంపుడి ` ప్రీ రిలీజ్‌ ఈవెంట్
 `శివ‌శంక‌రీ` ఫ్యూజ‌న్ కవ‌ర్  సాంగ్ లాంచ్‌!!
పాట‌ల చిత్రీక‌ర‌ణ‌లో `ఎర్ర‌చీర‌`
నాచురల్ స్టార్ నాని 'గ్యాంగ్ లీడర్'  ఫస్ట్ లుక్
ఓ బేబిది ఊహించ‌ని విజ‌యం
పూరీతో చెయ్య‌డం ప‌రిణితి చెందిన భావ‌న క‌లిగింది- న‌భాన‌టేష్‌
సూపర్‌గుడ్‌ ఫిలింస్‌ అధినేత ఆర్‌.బి.చౌదరి మనవరాలు పూజ వివాహం
ఆలీ హీరోగా
బడిదొంగ లోగో
'నిను వీడని నీడను నేనే' స‌క్సెస్ సెల‌బ్రేష‌న్స్‌
'నిను వీడని నీడను నేనే' స‌క్సెస్ సెల‌బ్రేష‌న్స్‌
నేడు తొలి ఏకాదశి
పూరి కొత్త బిజినెస్
పూర్తి ఫాంట‌సీ కామెడీలో అంజ‌లి
శుక్రవారం ప్రత్యేక నమాజ్ సూరా
“విక్స్” అంటే జలుబుకు మాత్రమే కాదు..!
 శుక్ర‌వారం ల‌క్ష్మీ క‌టాక్షం
ఈ స్త్రీ మూర్తులకు శతకోటి దండాలు
శివాత్మిక లేక‌పోతే దొర‌సాని లేదు- ద‌ర్శ‌కుడు కె.వి.ఆర్‌.మ‌హేంద్ర‌
 'ఉండి పోరాదే' సాంగ్ రిలీజ్ చేసిన డేరింగ్ డైరెక్టర్ వి వి వినాయక్
'నిను వీడని నీడను నేనే' ఫస్ట్ టికెట్ లాంచ్ చేసిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్
డియ‌ర్ కామ్రేడ్ ట్రైల‌ర్ లాంచ్‌
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.