షాంఘై అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో జీవీ.ప్రకాశ్‌కుమార్‌ కథానాయకుడిగా నటించిన సర్వం తాళమయం చిత్రం ప్రదర్శించనున్నారు. జీవీ.ప్రకాశ్‌కుమార్, నెడుముడి వేణు, అపర్ణ బాలమురళీ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం సర్వం తాళమయం. ప్రముఖ ఛాయాగ్రహకుడు రాజీవ్‌మీనన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సంగీత మాంత్రికుడు ఏఆర్‌.రెహ్మాన్‌ సంగీతం అందించారు.

 

ఇటీవల విడుదలైన ఈ చిత్రం, మాస్ ఆడియన్లకు పెద్ద నచ్చకపోయినా, విమర్శకుల ప్రశంసలు మాత్రం  అందుకుంది. ఈ చిత్రం 22వ షాంఘై అంతర్జాతీయ చిత్రోత్సవాలకు మనోరమ విభాగంలో అధికారికపూర్వకంగా ఎంపికైనట్లు చిత్ర వర్గాల సమాచారం. శనివారం నుంచి ప్రారంభమైన ఈ చిత్రోత్సవాలు ఈ నెల 24వ తేదీ వరకూ కొనసాగనున్నాయి.

 

జీవీ.ప్రకాశ్‌కుమార్‌ గతంలో మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేసిన సంగతి మనకు తెలిసినదే.  ఐతే గత కొద్ది కాలంగా అయన మ్యూజిక్ ని పక్కన పెట్టి, నటుడిగా అవతరించారు.  ఐతే ఆ సినిమాలు పెద్దగా ఆడక పోయినప్పటికే, విమర్శకుల ప్రశంసలు మాత్రం అందుకున్నాయి.  రీసెంట్ గా తెలుగు లో డబ్ ఐన, జ్యోతిక నటించిన "ఘాన్సీ" మూవీ తమిళంలో విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

 

ఇక హీరో పరంగా పెద్ద సక్సెస్ లు లేని ప్రకాష్ కు సర్వం తాళమయం  ఊరటనిస్తుందనటంలో ఏమాత్రం సందేహం లేదు.  కథ, కధనం, కెమెరా పనితనం, నటీనటుల నటన మరియు నిర్మాణ విలువలు దృష్టిలో ఉంచుకొని, ఇలాంటి అంతర్జాతీయ చిత్రోత్సవాలకు ఎంపిక చేస్తారు. ఇది ఒక అదృష్టమని చెప్పాలి.  గతంలో రిలీజ్ ఐన మన తెలుగు "బాహుబలి" కి కూడా ఇలాంటి గుర్తింపు లభించిందనే విషయం మనకు తెలిసిందే!


మరింత సమాచారం తెలుసుకోండి: