టాలీవుడ్ సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు అందానికి ఫిదా అవ్వని వారు ఉండరు. యూత్, మధ్య వయసు గల నుంచి వృద్ధుల వరకు ఎంతోమంది మహేష్ బాబుకు వీరాభిమానులు ఉన్నారు. మహేష్ బాబు సినిమా వస్తుందంటే చాలు వీరంతా థియేటర్లలో క్యూ కడుతుంటారు. మహేష్ బాబుకు  పలువురు రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు కూడా అభిమానులుగా ఉన్నారు. ముఖ్యంగా మహేష్ తన సినిమాల్లో నటనతో ఎలాంటి వారైనా  ఇట్టే ఆకట్టుకుంటారు. ఈ క్రమంలోనే ఓ లేడీ ఎమ్మెల్సీ కూడా తాను మహేష్ బాబు నటనకు ఫిదా అవుతానని... ఈ తరం జనరేషన్ హీరోల్లో మహేష్ అంటే తనకు ఎంతో ఇష్టమని చెప్పారు.


తెలంగాణలోని అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ తన తాజా ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ఓ రైల్వే అధికారిని పెళ్లి చేసుకున్న సత్యవతి రాథోడ్ ఆమె భర్తకు తెలుగు రాకపోవడంతో ఆయనతో కలిసి హిందీ సినిమాలు ఎక్కువగా చూసేవార‌ట. అప్పట్లో ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టమని తాను తొలిసారిగా థియేటర్‌లో చూసిన సినిమా లవకుశ అని చెప్పిన సత్యవతి... హీరోయిన్లలో జయసుధ, జయప్రద అంటే ఎంతో ఇష్టమని చెప్పుకొచ్చింది. 


ఇక ఈ తరం జనరేషన్ హీరోల్లో మహేష్ అంటే ఎంతో ఇష్టమని చెప్పిన ఆమె... ఆయన నటించిన సినిమాలన్నీ చూస్తాను అని చెప్పింది. ఇటీవల ఫిదా, బాహుబ‌లి సినిమాలను తన కొడుకు, కోడలితో కలిసి చూశానని చెప్పింది. ఇక తాను రాజకీయాల్లోకి రావడానికి ఎన్టీఆర్ స్పూర్తి అని కూడా సత్యవతి ఈ ఇంటర్వ్యూలో చెప్పింది.



మరింత సమాచారం తెలుసుకోండి: