'ఎన్టీఆర్ మహానాయకుడు, కథానాయకుడు' డిజాస్టర్స్ ఫలితం దర్శకుడు క్రిష్ కన్నా బాలయ్యకే ఎక్కువ డ్యామేజ్ అయిందన్న విషయం అందరు ఒప్పుకోవాల్సిందే. అయితే అప్పటి బాలయ్య, క్రిష్ ఇద్దరూ కూడా సైలెంట్ గానే ఉన్నారు. ఇక ఎలాగోలా తేరుకొని బాలయ్య 105 సినిమా చేస్తున్నాడు. దీంతో ఇంతకాలం క్రిష్ ఏం చేస్తున్నాడు ఎవరితో సినిమా చేయబోతున్నాడు అనే సందేహాలు సహజంగానే సినిమా ప్రేమికులకు వచ్చింది. ఎలాంటి కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ కాకపోవడం ఫలానా హీరోతో చేయబోతున్నట్టుగా ఎలాంటి న్యూస్ రాకపోవడం చూసి క్రిష్ ఇంకెంత గ్యాప్ తీసుకుంటాడా అనే అనుమానం అందరిలోను వచ్చింది.


కాని క్రిష్ మాత్రం సైలెంట్‌గా ఓ వెబ్ సిరీస్ కు స్క్రిప్ట్ కంప్లీట్ చేశాడట. క్రిష్ సొంత బ్యానర్ ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ మీద నిర్మించేందుకు ప్లాన్ రెడీ చేసుకున్నట్టుగా లేటెస్ట్ న్యూస్. కథ స్క్రీన్ ప్లే తో పాటు మాటలు కూడా క్రిష్ రాసుకుని ఫుల్ స్క్రిప్ట్ ని సిద్ధం చేశాడట. అయితే ఈ వెబ్ సిరీస్ కు దర్శకత్వం వహిస్తారా లేదా అనే క్లారిటీ మాత్రం లేదు. దర్శకత్వ బాద్యతలు వేరొకరికి అప్పజెప్పే అవకాశమే ఎక్కువగా కనిపిస్తోంది.. బాలీవుడ్ లో వెబ్ సిరీస్ ల ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. సినిమాలకు ఏ మాత్రం తీసిపోని కంటెంట్ క్వాలిటీతో అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్, జీ 5, హాట్ స్టార్ సంస్థలు విపరీతంగా పోటీ పడుతున్నాయి.  


వీటినే తెలుగుతో సహా సౌత్ భాషలు అన్నింటిలోకి డబ్బింగ్ చేస్తున్నారు. ఇప్పుడు క్రిష్ ప్లాన్ చేస్తోంది కూడా అలాంటిదే అని సమాచారం. ఎపిసోడ్స్‌గా డిఫరెంట్ జానర్స్ లో వస్తున్న ఈ వెబ్ సిరీస్ లకు విపరీతమైన ఆదరణ దక్కడంతో ఇంకొందరు టాలీవుడ్ అగ్ర దర్శక నిర్మాతలు వీటి గురించి చాలా ఇంట్రస్టింగా ఉన్నారు. చూస్తుంటే రానున్న రోజుల్లో ఇదో పెద్ద ట్రెండ్ గా మారే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: