పలు చిత్రాల్లో కమిడియన్ నటించి హిరోగా చేస్తున్నాడు. ప్రస్తుతం తను చేసిన మూడవ చిత్రం 'వజ్ర కవచధర గోవింద' తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అరుణ్ పవార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంపై మొదటి నుండి ప్రేక్షకుల్లో ఆసక్తి ఉంది. ఈనెల 14న విడుదలైన ఈ చిత్రంకు మొదట మిశ్రమ స్పందన వచ్చినా ఆ తర్వాత యావరేజ్ టాక్ వస్తుందని హీరో సప్తగిరి చెప్పుకొచ్చాడు.

ప్రస్తుతం స్కూల్స్ రీ ఓపెన్ హడావుడి ఉన్న నేపథ్యంలో కొన్ని ఏరియాల్లో కలెక్షన్స్ కాస్త తక్కువగా ఉన్నా కూడా ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ ను దక్కించుకోవడం ఖాయం అంటూ చిత్ర యూనిట్ సభ్యులు అభిప్రాయం వ్యక్తం చేశారు. తాజాగా హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సినిమా సక్సెస్ మీట్ లో సప్తగిరి మాట్లాడుతూ.. మొదటి రోజు మిక్డ్స్ టాక్ అన్నారు ఆ తర్వాత యావరేజ్ అంటున్నారు. యావరేజ్ టాక్ అనేది మా సినిమాకు కొండంత బలం. తప్పకుండా మా సినిమాను అంతా చూస్తారనే నమ్మకం ఉంది.

కెరీర్ లో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న చిన్న వాళ్లం.. మీ సపోర్ట్ ఉంటేనే ముందు ముందు మంచి సినిమాలు చేస్తాం. చిన్నవాళ్లం అయిన మమ్ములను ఇప్పుడే తుంచేస్తే ముందుకు వెళ్లలేం. అందుకే మమ్ములను దయచేసి ప్రోత్సహించండి. స్కూల్స్ రీ ఓపెన్ అయినా కూడా 50 శాతం థియేటర్లలో మంచి వసూళ్లు నమోదు అయినట్లుగా డిస్ట్రిబ్యూటర్ బ్రహ్మన్న చెప్పడం ఆనందంగా ఉంది. బి.. సి సెంటర్ల నుండి మంచి స్పందన వస్తుంది. ఎ సెంటర్ వారు కూడా మా సినిమాను చూసి మమ్ములను ఆధరించాలని కోరుకుంటున్నాను అంటూ ఈ సందర్బంగా సప్తగిరి రిక్వెస్ట్ చేశాడు.

సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ లెంగ్త్ ఎక్కువ అయినట్లుగా కొందరు అన్నారు. అందుకే సెకండ్ హాఫ్ నుండి 10 నిమిషాలు తొలగించినట్లుగా కూడా సప్తగిరి పేర్కొన్నాడు. సినిమాకు ప్రేక్షకుల నుండి వస్తున్న రెస్పాన్స్ కు చాలా సంతోషంగా ఉందని ఇతర యూనిట్ సభ్యులు ఆనందంను వ్యక్తం చేశారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: