నిజానికి కొన్ని ఘటనలు ఒక్కో సందర్భంలో అనుకోకుండా జరుగుతూ ఉంటాయి. అయితే యాదృచ్చికంగా జరిగే అటువంటి వాటి వలన కొందరికి మేలు జరిగితే మరికొందరికి కొద్దిపాటి సమస్యలు ఏర్పడుతుంటాయి. ఇపుడు ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే, మన టాలీవుడ్ లో కొన్ని పెద్ద సినిమాలు ఒకేసారి విడుదలవ్వడం ఎప్పటినుండో చూస్తూ ఉన్నాం. అయితే వాటిలో కొన్ని ముందే డేట్స్ ఫిక్స్ చేసుకున్నవి అయితే, మరికొన్ని మాత్రం యాదృచ్చికంగా ఆ సమయానికి విడుదలయ్యేవి. 

ఇక ప్రస్తుతం రాబోయే ఆగష్టు 9న యువ సామ్రాట్ నాగార్జున నటిస్తున్న మన్మధుడు2 వస్తుంటే, ఖచ్చితంగా వారం తరువాత అంటే ఆగష్టు 15న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మోస్ట్ అవైటెడ్ సినిమా సాహో విడుదలవుతోంది. అయితే ఈ రెండు బడా హీరోల సినిమాలు దాదాపుగా వారం గ్యాప్ తో బాక్సాఫీస్ దగ్గర క్లాష్ అవ్వడం వల్ల ఇరువురికి కొద్దిపాటి నష్టాలు ఉంటాయని అంటున్నారు సినీ విశ్లేషకులు. అయితే నిజానికి మన్మధుడు 2ని జులై లో ప్రేక్షకుల ముందుకు తీసుకువద్దాం అనుకున్నారు, అయితే కొన్ని కారణాల వలన కాస్త పోస్ట్ పోన్ చేసి ఆగష్టు 9న విడుదల చేయడం జరుగుతోందట. ఇకపోతే ఎప్పుడో పూర్తి కావలసిన సాహో, మధ్యలో చాలా సార్లు షూటింగ్ వాయిదా పడిన కారణంగా ఆఖరుకి ఆగష్టు 15న విడుదలకు ఫిక్స్ అయింది. 

అయితే తమ సినిమా సాహోకు సినిమా పోటీ కాదని, రెండు సినిమాలు మంచి విజయాలు సాధించాలని కోరుకుంటున్నట్లు మన్మధుడు టీమ్ అంటోందట. ఇకపోతే సాహో యూనిట్ కూడా నాగార్జున గారి సినిమా తప్పకుండా విజయవంతం అవ్వాలని కోరుకుంటున్నట్లు అభిప్రాయపడుతోందట. అయితే వారం గ్యాప్ లో వస్తున్న ఈ రెండు సినిమాల్లో రెండూ మంచి విజయవంతం అయితే పర్లేదుకానీ, ఒకటి హిట్ అయి రెండవది ఫ్లాప్ అయితే మాత్రం ఆ సినిమాకు ఇబ్బందే. మరి రాబోయే రోజుల్లో విడుదల కానున్న ఈ రెండు సినిమాలు ఎంతటి విజయాన్ని అందుకుంటాయో వేచి చూద్దాం...!!


మరింత సమాచారం తెలుసుకోండి: