అక్కినేని ఫ్యామిలీ అంతా కలిసి మనం సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆదరించారు. ఈ క్రమంలో మరొకసారి నాగార్జున నాగచైతన్య కలసి మరొకసారి నటించబోతున్నారు. డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తండ్రి కొడుకులు కలసి 'బంగార్రాజు' అనే సినిమాలో త్వరలో నటించబోతున్నారు. ప్రస్తుతం నాగార్జున 'మన్మధుడు 2' సినిమాలో నటిస్తున్నారు.


త్వరలో ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. తర్వాత వెంటనే బిగ్‌బాస్‌ 3 కి హోస్ట్‌గా వ్యవహరించబోతున్నారు. అయితే నాగార్జున ఒకపక్క షో చేస్తూ మరో పక్క  బంగార్రాజు సినిమా చేసే ఆలోచనలో ఉన్నట్లు ఫిల్మ్ నగర్ టాక్. ఈ సినిమాని సంక్రాంతికి విడుదల చేయాలని భావిస్తున్న నిర్మాత ఎలాగైనా సినిమాని త్వరగా మొదలు పెట్టడానికి సన్నాహాలు చేస్తున్నారు.


ఈ సినిమాలో నాగార్జున పక్కన హీరోయిన్ గా రమ్యకృష్ణ ఓకే అయినట్లు సమాచారం. అంతేకాకుండా  నాగచైతన్య కు జోడిగా ... నాగార్జునకు మనవరాలిగా సమంత నటిస్తున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్. ముఖ్యంగా ఇటీవల నాగచైతన్యతో కలిసి సమంత నటిస్తున్న సినిమాలు విజయం సాధిస్తున్న క్రమంలో మళ్లీ అదే సెంటిమెంట్ రిపీట్ చేయాలని అక్కినేని ఫ్యామిలీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అతి త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు వెళ్లడయ్యే అవకాశం ఉంది. ఒకవేళ సమంత కనుక ఈ చిత్రంలో ఉంటే సినిమా స్థాయి మరింత పెరగడం ఖాయం. ప్రస్తుతం సమంత ‘ఓ బేబీ’ చిత్రం ప్రమోషన్‌ కార్యక్రమాల్లో బిజీగా ఉంది.

 



మరింత సమాచారం తెలుసుకోండి: