కోలీవుడ్ హీరో సూర్యకు తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. అయితే ఈమధ్య తమిళ సినిమాలకు తెలుగులో పెద్దగా కలిసి రావడం లేదు. రజిని, కమల్ హాసన్ సినిమాలే బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొడుతున్నాయి. గజిని సినిమా నుండి సూర్యకు మంచి క్రేజ్ రాగా అప్పటినుండి తన ప్రతి సినిమా తెలుగులో రిలీజ్ చేస్తున్నారు.


అయితే అంతకుముందు సూర్య సినిమాల వసూళ్లు స్ట్రైట్ తెలుగు సినిమాల కలక్షన్స్ లానే బాగా ఉండేవి. కాని పరిస్థితి మారింది. కొత్తదనం ఉంటేనే కాని తెలుగులో డబ్బింగ్ సినిమాలు వర్క్ అవుట్ అవ్వట్లేదు. ఈ క్రమంలో సూర్య హీరోగా ఈమధ్య వచ్చిన ఎన్.జి.కే సినిమా కూడా నిరాశ పరచింది.


సెల్వ రాఘవన్ డైరక్షన్ లో వచ్చిన ఎన్.జి.కే సినిమా తెలుగులో సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్ లో రాధామోహన్ 9 కోట్లకు కొన్నారు. అయితే ఈ సినిమా మొదటి షో నుండి ఫ్లాప్ టాక్ తెచ్చుకోగా ఫైనల్ గా 4.5 కోట్ల కలక్షన్స్ తో సరిపెట్టుకుందని తెలుస్తుంది. అంటే సగానికి సగం లాస్ అన్నట్టే. సింగం సీరీస్ ల తర్వాత సూర్య సినిమాలు తెలుగులో పెద్దగా వర్క్ అవుట్ కావట్లేదు.


ప్రస్తుతం సూర్య కె.వి ఆనంద్ డైరక్షన్ లో కాపాన్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఆగష్టు 30న రిలీజ్ ఫిక్స్ చేశారు. ఈ సినిమా అయినా సూర్యకు హిట్ ఇస్తుందేమో చూడాలి. తన ప్రతి సినిమాలో కొత్తదనం ఉండేలా చూసుకునే సూర్య ఈమధ్య రొటీన్ సినిమాలు చేస్తున్నాడు అందుకే కెరియర్ లో కాస్త వెనుకపడ్డాడు. 



మరింత సమాచారం తెలుసుకోండి: