బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న భారీ మూవీ ఆర్.ఆర్.ఆర్. ఎన్.టి.ఆర్, రాం చరణ్ ఇద్దరు స్టార్స్ ను కలిపి సినిమా చేయడం రాజమౌళి వల్లే సాధ్యమవుతుంది. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా 400 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. సినిమా ఇద్దరు రియల్ లైఫ్ హీరోస్ కొమరం భీం, అల్లూరి సీతారామరాజు పాత్రల్లో తారక్, చరణ్ నటిస్తున్నారు.


ఇక ఈ సినిమాలో బాలీవుడ్ భామ అలియా భట్ ఒక హీరోయిన్ గా సెలెక్ట్ అవగా సెకండ్ హీరోయిన్ గా సాయి పల్లవిని తీసుకున్నారని తెలుస్తుంది. ప్రస్తుతం 3వ షెడ్యూల్ జరుపుకుంటున్న ఈ సినిమా బిజినెస్ కూడా అప్పుడే మొదలైంది. ఇప్పటికే ఓవర్సీస్ లో ఆర్.ఆర్.ఆర్ 65 కోట్ల డీల్ క్లోజ్ అయ్యిందని తెలుస్తుంది.


అంతేకాదు నైజాం లో కూడా ట్రిపుల్ ఆర్ కు ఫ్యాన్సీ ఆఫర్ వచ్చిందట. ఒక్క నైజాం లోనే 70 నుండి 80 కోట్ల దాకా బిజినెస్ చేస్తుందని చెబుతున్నారు. ఆల్రెడీ దిల్ రాజు, ఆసియన్ సునీల్ నారంగ్ దానయ్యతో టచ్ లో ఉన్నారట. కేవలం నైజాం లోనే 70 కోట్లు అంటే తెలుగు రెండు రాష్ట్రాల్లోనే ఆర్.ఆర్.ఆర్ 200 కోట్లకు పైగా బిజినెస్ చేసే అవకాశం ఉంది.


చూస్తుంటే ఆర్.ఆర్.ఆర్ సినిమా మరో బాహుబలి చేసేలా ఉన్నాడు రాజమౌళి. బాహుబలి 2 సినిమా నైజాం లో 70 కోట్ల బిజినెస్ చేసింది. ఆర్.ఆర్.ఆర్ కూడా అంత రేంజ్ లో బిజినెస్ చేస్తుంది. ఎన్.టి.ఆర్, రాం చరణ్ లాంటి స్టార్స్ ఉన్నారు కాబట్టి సినిమాపై భారీ అంచనాలున్నాయి. మరి జక్కన్న ఈసారి ఎలాంటి అద్భుతాలు సృష్టిస్తాడో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: