జాన్వీ కపూర్ గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు.  వరసగా సినిమాలు చేస్తోంది.  శ్రీదేవి కూతురిగా ఎంట్రీ ఇచ్చిన ఈ భామ, ఇప్పుడు కరణ్ జోహార్ సినిమాల్లో నటిస్తోంది.  గ్లామర్ కు ఏ మాత్రం అడ్డు చెప్పదు ఈ ముద్దుగుమ్మ . 


ఒకవైపు సినిమాలు చేస్తూనే, మరోవైపు సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటోంది.  సోషల్ మీడియాలో ఈ అమ్మడి ఫాలోయింగ్ అంతాఇంతా కాదు.   జిమ్ కు వెళ్లే సమయంలో కూడా హాట్ హాట్ డ్రెస్ లతో పిచ్చెక్కిస్తుంటుంది ఈ అమ్మడు.   అందుకే ఆమెకు సోసిల్ మీడియా లో అత్యధిక ఫాలోయింగ్ ఉంటుంది.  


తాజాగా ఓ  చిన్న వీడియో ను షేర్ చేసింది.  ఈ వీడియోలో ఈ అమ్మడు చేసిన రచ్చ అంతాఇంతా కాదు.  బెల్లి డ్యాన్స్ తో ఇరగదీసింది.   ఈ బెల్లి డ్యాన్స్ అందరికి సెట్  కాదు.  జాన్వీ డ్యాన్స్ ప్రాక్టీస్ సెషన్స్ లో బిజీగా ఉన్న దృశ్యాలు సోషల్ మీడియాలోకి వస్తున్నాయి. ఈ బ్యూటీ పాశ్చాత్య నృత్యాల్లోనూ రాటు దేలుతోందని ఈ వీడియోలు చెబుతున్నాయి. లేటెస్టుగా బెల్లీ డ్యాన్సులు ప్రాక్టీస్ చేస్తున్న వీడియోని  షేర్ చేసింది.  


ఇక డ్యాన్సుల్లో మామ్ శ్రీదేవి అంత ఫ్లెక్సిబిలిటీ ఉన్న స్టార్ గా తనని తాను ఆవిష్కరించుకుంటుందనే అర్థమవుతోంది.   ఎలాగైన స్టార్ హీరోయిన్ గా ఎదిగి తన తల్లి పేరు నిలబెట్టాలని చూస్తోంది ఈ అమ్మడు.  


మరింత సమాచారం తెలుసుకోండి: