సోషల్ మీడియాలో రేణుదేశాయ్ చాలా యాక్టీవ్ గా ఉంటుంది. తరుచు వివాదాల్లో కూడా ఉంటుంది. తాజాగా ఆమెకు వచ్చిన కోపం అంతా ఇంతా కాదు. ఎప్పుడూ లేనంతగా బరస్ట్ అయిన ఆమె సంచలన వ్యాఖ్య చేశారు. తన వ్యక్తిగత ఫోటోకు ఒక వెబ్ సైట్ పెట్టిన శీర్షికతో ఆమె తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. కదలించుకొని మరీ గుచ్చినట్లుగా ఉన్న సదరు శీర్షికపై ఆమె తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.


ఇదే అంశాన్ని తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేశారు. సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే ఆమె.. తరచూ తనకు నచ్చిన విషయాల్ని పంచుకుంటూ ఉంటారు. పిల్లలతో కలిసిన ఫోటోల్ని పోస్ట్ చేస్తుంటారు. తాజాగా ఆమె కొడుకు అకీరా.. కుమార్తెతో కలిసి దిగిన ఒక ఫోటోను ఇన్ స్టాగ్రాంలో పోస్ట్ చేశారు. ఆ ఫోటోకు ఒక వెబ్ సైట్ పవన్ కల్యాణ్ పిల్లలు.. ఆయన మాజీ భార్య రేణుదేశాయ్ తో అంటూ శీర్షిక పెట్టారు.


దీనిపై రేణు ఘాటుగా రియాక్ట్ అయ్యారు. గతంలో ఎప్పుడూ లేనంత తీవ్రంగా మండిపడ్డ ఆమె.. తన ఫేస్ బుక్ ఖాతాలో రెండు లైన్లలో ఊహించని రీతిలో వ్యాఖ్య చేశారు. ఇప్పుడే ఒకరు నాకిది పంపించారు.. ఈ ఆర్టికల్ రాసిన వ్యక్తి ఒక తల్లికే పుట్టి ఉంటాడు. ఒక తల్లిని ఇలా బాధ పెట్టకూడదు ఎప్పుడూ అంటూ మెసేజ్ పోస్ట్ చేశారు. నిజానికి సదరు వెబ్ సైట్ లో ఎలాంటి స్టోరీ లేదు. కేవలం ఫోటోకు రైటప్ మాత్రమే.

మరింత సమాచారం తెలుసుకోండి: