‘సాహో’ విడుదల కాబోయే ఆగష్టు 15న ‘ఆర్ ఆర్ ఆర్’ ఫస్ట్ లుక్ విడుదల కాబోతోంది అని వార్తలు రావడంతో తన శిష్యుడు ప్రభాస్ మ్యానియాకు రాజమౌళి ‘ఆర్ ఆర్ ఆర్’ మ్యానియా పరోక్షంగా పోటీ ఇవ్వబోతోందా అంటూ కొందరు సందేహాలు వ్యక్త పరిచారు. ఈ కామెంట్స్ అన్నీ రాజమౌళి దృష్టి వరకు వెళ్ళినట్లు ఉన్నాయి. 

దీనితో వెంటనే నష్ట నివారణ చర్యలు చేబట్టాడు రాజమౌళి. మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం ‘ఆర్ ఆర్ ఆర్’ ఫస్ట్ లుక్ ఆగష్టు 15న విడుదల కావడం లేదనీ ఇది అంతా మీడియా సృష్టించిన వార్తలు మాత్రమే అంటూ క్లారిటీ ఇచ్చాడు. వాస్తవానికి ‘ఆర్ ఆర్ ఆర్’ కథ స్వాతంత్రోద్యమ నేపద్యంతో ఉండటంతో ఈమూవీ ఫస్ట్ లుక్ ను ఆగష్టు 15న విడుదల చేస్తారు అని అందరు భావించారు. 

అయితే ఈ విషయంలో రాజమౌళి ప్లాన్స్ వేరు అని అంటున్నారు. ‘ఆర్ ఆర్ ఆర్’ వచ్చే ఏడాది జూలైలో మాత్రమే విడుదల కాబోతోంది. దీనితో ఇంత ముందుగా ‘ఆర్ ఆర్ ఆర్’ ఫస్ట్ లుక్ విడుదల చేస్తే ఈమూవీ పై ఉన్న క్రేజ్ మరింత పెరగకుండా అనవసరపు నెగిటివ్ కామెంట్స్ కు ఆస్కారం వచ్చే అవకాసం ఉందనీ రాజమౌళి భావిస్తున్నట్లు టాక్. 

దీనితో ‘ఆర్ ఆర్ ఆర్’ ఫస్ట్ లుక్ ను వచ్చే సంవత్సరం జనవరి 1న కానీ లేకుంటే అదే నెలలో వచ్చే రిపబ్లిక్ డే రోజున కానీ ఈమూవీ ఫస్ట్ లుక్ ను విడుదల చేసి అప్పటి నుంచి ఈమూవీ ప్రమోషన్ ను మొదలు పెట్టాలని రాజమౌళి ఆలోచన అని అంటున్నారు. ఇది ఇలా ఉంటే ఈమూవీ నైజాం రైట్స్ కోసం దిల్ రాజ్ అదేవిధంగా ఏషియన్ సునీల్ ల మధ్య పోటీ నడవడమే కాకుండా ఈమూవీ నైజాం రేట్స్ కు 80 కోట్ల రేటు పలకడం అత్యంత ఆశ్చర్యంగా మారింది..    


మరింత సమాచారం తెలుసుకోండి: