నాగార్జున స్పీడ్ మరింత పెరగడంతో ‘మన్మధుడు 2’ సినిమా తరువాత నాగ్ నటించబోయే తదుపరి సినిమా కూడ లైన్ లోకి వచ్చేసింది. ‘బిగ్ బాస్ 3’ ప్రకటన వచ్చిన వెంటనే ఆ షో విషయాలను చూస్తూనే నాగార్జున తన తదుపరి సినిమాగా ‘బంగార్రాజు’ ను సెట్స్ పైకి తీసుకు వేల్లబోతున్నాడు. 

అన్నీ కుదిరితే ఈమూవీని వచ్చే సంవత్సరం సమ్మర్ రేస్ కు తీసుకు రావాలని నాగార్జున ప్లాన్. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తిచేసుకున్న ‘బంగార్రాజు’ షూటింగ్ ను దసరా రోజున మొదలు పెట్టాలని నాగార్జున ప్లాన్ అని అంటున్నారు. ఈమూవీకి ‘ఓ బేబీ’ రిజల్ట్ కు ఇప్పుడు లింక్ పడటం అత్యంత ఆశ్చర్యంగా మారింది. 

ఈసినిమాలో నాగార్జున నాగచైతన్య కలిసి నటిస్తున్నారు. నాగార్జునకు జోడీగా రమ్య కృష్ణ ఇప్పటికే ఎంపిక అయింది. అయితే చైతన్యకు మాత్రం హీరోయిన్ ఎంపిక కావలసి ఉంది. ‘మజిలీ’ సూపర్ సక్సస్ తో చైతు సమంతల జంటకు విపరీతమైన క్రేజ్ వచ్చిన నేపధ్యంలో ఆ మ్యాజిక్ ను మళ్ళీ ‘బంగార్రాజు’ కోసం రిపీట్ చేస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచనలలో నాగార్జున ఉన్నట్లు టాక్. 

అయితే సమంత దృష్టి మాత్రం తాను నటించే హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాల పై ఉండటంతో మళ్ళీ చైతన్యతో గ్యాప్ లేకుండా ‘బంగార్రాజు’ మూవీలో నటించి తమ జంట పై  ఉన్న క్రేజ్ ను పోగొట్టుకునే కంటే కొన్ని వరస పెట్టి హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు చేసిన తరువాత మళ్ళీ చైతన్యతో కలిసి నటిస్తాను అని చెపుతున్నట్లు సమాచారం. దీనితో ‘ఓ బేబీ’ రిజల్ట్ తరువాత  ఈ విషయం ఆలోచించాలి అని నాగార్జున భావిస్తూ ‘బంగార్రాజు’ లో చైతన్య పక్కన సమంత కాకుంటే మరొక కొత్త అమ్మాయిని పరిచయం చేసే ఉద్దేశ్యం లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి: