రకుల్ ప్రీత్ సింగ్. ఈ పొడగరి సుందరిలో టాలెంట్ చాలా ఉంది. దేన్ని అయినా తనకు అనుకూలం చేసుకుని తగ్గట్టుగా హావభావాలు పండించే ఈ పంజాబీ భామను కొత్త మూవీలో మరింత స్పెషల్ గా రోల్లొ  డిజైన్ చేశారట. తనదైన రొమాన్స్ తో రకుల్ రెచ్చిపోతుందంట.


ఈ విషయాన్ని మన్మధుడు 2 డైరెక్టర్ రాహుల్ చెబుతున్నాడు. ఫస్ట్ టీజర్ లో రకుల్ కనిపించకపోవడాన్ని తప్పుగా అర్ధం చేసుకోవద్దని అంటున్నాడు. రకుల్ ఈ మూవీలో ఫుల్ లెంగ్త్  రోల్ ప్లే చేసిందని, నాగ్ తో ఆమె రొమన్స్ వెరీ స్పెషల్ అంటున్నాడు రాహుల్. ఆ ప్రామిసింగ్ టీజర్ ని త్వరలో రిలీజ్ చేస్తానని చెబుతున్నాడు.


మరి రకుల్ లేట్ వయసు నాగ్ తో ఘాటు రొమాన్స్ ఎలా చేసిందన్నది ఇపుడు అందరికీ ఇంటెరెస్టింగ్ గా ఉంది. అసలే అక్కడ ఉన్నది మన్మధుడు ఏజ్ లో సంబంధం లేకుండా ఇప్పటికీ తన చరిస్మాటిక్ గ్లామర్ ని అలా కాపాడుకుంటున్నాడు. మరి ఈ ఇద్దరు పొడుగు జంట శ్రుంగార సొగసు సోయగాలన్నీ రెండవ టీజర్ లో బాగా దట్టించి రిలీజ్ చేస్తాడట. వెయిట్ చేయాలిగా .. తప్పదు.


మరింత సమాచారం తెలుసుకోండి: