ఒక వేదికపై సప్తగిరి మాట్లాడుతూ .. "మా సినిమాకి యావరేజ్ టాక్ వచ్చింది. స్కూళ్లు తెరవడం వలన ఆ ప్రభావం వసూళ్లపై పడిందని భావిస్తున్నాము. బి - సి సెంటర్లలో సినిమా బాగానే ఆడుతున్నందుకు ఆనందంగా వుంది. సెకండాఫ్ సాగతీగా ఉందనే రిపోర్ట్ వలన 10 నిమిషాల నిడివిని తగ్గించడం జరిగింది. మీరంతా ఈ సినిమా చూసి మమ్మల్ని ఆశీర్వదించాలి. ఇక్కడే మమ్మల్ని తుంచేస్తే ముందుకు వెళ్లలేం. మీరంతా సపోర్ట్ చేస్తారనే భావిస్తున్నాము" అని చెప్పుకొచ్చారు.

 

సప్తగిరి కథానాయకుడిగా దర్శకుడు అరుణ్ పవార్ తెరకెక్కించిన 'వజ్రకవచధర గోవింద' సినిమా ఈ నెల 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాలో సప్తగిరి మార్క్ కామెడీ లేదనే టాక్ వచ్చింది. తాజాగా ఈ సినిమా టీమ్ ప్రెస్ మీట్ ను నిర్వహించి, పై వివరాలు చిత్ర యూనిట్ పేర్కొన్నారు. ఈ ప్రెస్ మీట్ లో హీరో, డైరెక్టర్, ప్రొడ్యూసర్ అండ్ టీం పాల్గొంది.

 

సప్తగిరి మొదట కామిడి చిత్రాలకే పరిమితయినా మెల్లగా హీరో గా యు టర్న్ తీసుకున్నారు.  అయన మొదట హీరోగా చేసిన సప్తగిరి express ఫర్వాలేదనిపించింది. తరువాత వచ్చిన సప్తగిరి LLB పెద్దగా ఆడలేదు.  ఇక రీసెంట్ గా వచ్చిన సినిమా కూడా నెగటివ్ టాక్ రావడంతో మన సప్తగిరి కెరీర్ మీద బెంగ పెట్టుకున్నట్లుంది.  అందుకే డైరెక్ట్ గా ప్రేక్షకులనే చూడమని అడుగుతున్నారు.

 

సప్తగిరి కెరీర్ మొట్ట మొదట "పరుగు" తో మొదలైన, అతనికి బ్రేక్ ఇచ్చిన చిత్రం మాత్రం "ప్రేమ కథ చిత్రం" అని చెప్పుకోవాలి.  ఇందులో ఆటను చేసిన కామిడి అంత ఇంత కాదు.  పిల్లల నుండి, పెద్దలవరకు ఈ చిత్రాన్ని ఆదరించారు.  ఒక రకంగా చెప్పుకోవాలంటే, ఈ చిత్రం యొక్క సక్సెస్ మూలకారకుడు ఇతనే అని చెప్పడానికి ఏమాత్రము సందేహించకూడదు.

మరింత సమాచారం తెలుసుకోండి: