టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ టెంపర్ సినిమా నుంచి వరుస హిట్లతో దూసుకుపోతున్నారు. తాజాగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మల్టీ స్టారర్ ఆర్ ఆర్ ఆర్ సినిమాలో మరో యంగ్ హీరో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి నటిస్తున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ చరిత్రలోనే టాప్ క్రేజీ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను డి.వి.వి.దానయ్య అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ గిరిజన యోధుడు కొమరంభీం పాత్రలో ఎన్టీఆర్ నటిస్తున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది మే వరకు మార్చి, ఏప్రిల్ వరకు ఈ సినిమా షూటింగ్లో ఎన్టీఆర్ బిజీ కానున్నాడు.
ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ అప్పుడే మరో ప్రాజెక్ట్ కు కమిట్ అయినట్లు టాలీవుడ్ సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ కమిట్ అయిన డైరెక్టర్ ఎవరో కాదు తనకు జనతా గ్యారేజ్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన కొరటాల శివ అని ఫిల్మ్‌నగర్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం కొరటాల శివ చిరంజీవితో చేసే ప్రాజెక్టు కోసం వర్క్ చేస్తున్నాడు. చిరు సైరా తర్వాత కొరటాలతో కమిట్ అయ్యాడు. కొణిదెల సంస్థ మొన్న అతని బర్త్ డే సందర్భంగా అధికారికంగా చెప్పేసింది కాబట్టి ఇక నో డౌట్స్.
ఇక కొరటాల చిరు సినిమాను కంప్లీట్ చేసే టైంకు అటు ఆర్ ఆర్ ఆర్ కంప్లీట్ అవుతుంది. ఆ వెంటనే ఎన్టీఆర్ ప్రాజెక్టును పట్టాలెక్కిం చేయవచ్చు. ఈ ప్లాన్‌తో కొరటాల చిరు ప్రాజెక్టును కరెక్టుగా ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ కంప్లీట్ అయ్యే టైంకు ఫినిష్ చేసేలా ప్లాన్ చేసుకుంటున్నాడట. జనతా గ్యారేజ్ లాంటి మాస్ హిట్‌ను ఇచ్చిన కొరటాల ఇప్పుడు ఎలాంటి కథతో ఎన్టీఆర్‌ను ప్రజెంట్ చేస్తాడో ? చూడాలి.