ఒక పెద్ద ప్రొడక్షన్స్ తో కలిసి త్రివిక్రమ్ సమక్షంలో కథలపై చర్చలు జరిపి సినిమాలను నిర్మించేందుకు పవన్ ఆలోచిస్తున్నట్లు టాక్. పాలిటిక్స్ లో కొనసాగాలంటే ఆర్థికంగా ఎంతో కొంత బలంగా ఉండక తప్పదు. అందుచేత పవన్ ఈ విధంగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

 

అయితే పవన్ సినీ కెరీర్ కి సంబందించిన మరొక రూమర్ ఇప్పుడు మరింత వైరల్ గా మారింది. పవన్ రాజకీయాల్లో ఉన్నప్పటికీ సినిమాలు జనసేన తెర వెనుక  తెరకెక్కుతాయట. అంటే తన పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ సంస్థలో సినిమాలను నిర్మించేందుకు పవన్ సిద్దమవుతున్నట్లు మనకు ఇట్టే అర్ధం అయిపోతుంది.

 

పవన్  ఓటమి అనంతరం సినిమాల్లోకి వచ్చేస్తారని ఎన్నో రూమర్స్ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే అన్ని విమర్శలకు పవన్ కౌంటర్ ఇచ్చే విధంగా తన తరువాత 25 ఏళ్ల జీవితం ప్రజల కోసమే అని తుది శ్వాస వరకు రాజకీయాల్లోనే కొనసాగుతానని వివరణ ఇచ్చారు. చూద్దాం మరి ఇంకో ఐదేళ్ళలో ఎన్ని అద్భుతాలు జరుగుతాయో..

 

అయితే అభిమాన సోదరులు మాత్రం ఆయన ఖాళీ సమయాలలో సినిమాలు చేస్తే బావుంటుందని తెగ ప్రయాస పడుతున్నారు.  కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏది చెప్పినా చాల నిక్కచ్చిగా, స్పష్టంగా చెబుతారు. అభిమానుల కోరిక మేరకు మరల సినిమాలు చేస్తారా, లేదా అన్న మాట మీద మీద కట్టుబడి వుంటారా అనేది వేచిచూడాలి మరి!


మరింత సమాచారం తెలుసుకోండి: