యువ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్  అల్లుడుశీను చిత్రంతో హీరోగా పరిచయం అయ్యాడు . ఆ సినిమా మంచి వసూళ్ల నే రాబట్టింది అయితే భారీ బడ్జెట్ కారణంగా సాలిడ్ హిట్ అనలేం , దాని తర్వాత చాలా చిత్రాలు చేసాడు కానీ ఒక్క సినిమా కూడా హిట్ కాలేదు.ఆశించినంత ఫ‌లితాన్ని ఇవ్వ‌లేదు. దాంతో హిట్ కోసం పోరాటం చేస్తూనే ఉన్నాడు ఈ హీరో. అయితే ఎంతగా ప్లాన్ చేసినప్పటికీ హిట్ మాత్రం దక్కడం లేదు దాంతో తమిళ హిట్ చిత్రంపై పడ్డాడు ఈ కుర్ర హీరో .
 
తమిళంలో సూపర్ హిట్ అయిన రాట్ససన్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయనున్నాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ . రమేష్ వర్మ అనే దర్శకుడితో తన తదుపరి చిత్రాన్ని చేయడానికి  రెడీ అవుతున్నాడు . తమిళంలో హిట్ కావడంతో ఇక్కడ కూడా హిట్ అవుతుందని ఆశిస్తున్నాడు ఈ బెల్లంకొండ . తమిళ రీమేక్ అయినా ఈ బెల్లంకొండ ని బంగారు కొండని చేస్తుందా ? లేదా చూడాలి .


బెల్లంకొండ శ్రీనివాస్ కథానాయకుడిగా రమేశ్ వర్మ దర్శకత్వంలో 'రాక్షసుడు' రూపొందుతోంది. అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ డిఫరెంట్ లుక్ తో కనిపించనున్నాడు. వరుస హత్యలు చేసుకుంటూ వెళ్లే ఒక సైకోను పట్టుకునే పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఆయన కనిపించనున్నారు.తాజాగా ఈ సినిమాకి సంబంధించిన స్టిల్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఈ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్ మరింత హ్యాండ్సమ్ గా కనిపించనున్నాడనే విషయం ఈ స్టిల్స్ ను బట్టి తెలుస్తోంది. జిబ్రాన్ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు. క్రితం ఏడాది చివర్లో తమిళంలో హిట్ కొట్టిన 'రాచ్చసన్'కి ఇది రీమేక్. ఆ సినిమా మాదిరిగానే ఇది కూడా హిట్ అవుతుందేమో చూడాలి. ఈ సారైనా హిట్ రావాల‌ని కోరుకుంటున్నాను.


మరింత సమాచారం తెలుసుకోండి: