మన్మథుడిగా అమ్మాయిల మనస్సులను దోచుకున్న కింగ్ నాగార్జున తో చిత్రం చేసే అదృష్టం అందరికీ దొరకదు.అలాంటి అవకాశం రాహుల్ రవీంద్రన్ కు రెండవ చిత్రానికే దొరికింది. దానితో రాహుల్ నాగార్జున గారి కెరీర్ లో ఆల్ టైమ్ హిట్ గా నిలిచిన మన్మథుడు సీక్వెల్ గా మన్మథుడు2 ను రూపొందిస్తున్నారు.

ప్రస్తుతం ఈ చిత్ర టీజర్ రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ ను పొందుతుంది.అయితే దర్శకుడు రాహుల్ భార్య చిన్నమ్మాయి తమిళనాడు లో మీటూ ఉద్యమం సందర్భంగా హీరోల పై కూడా ఫైర్ అవుతున్నారు.అందులోని భాగంగా 60 ఏళ్ళ హీరోల పక్క కూతురు వయస్సు హీరోయిన్లు నటించడం ఏంటి? అని విమర్శించారు.

దానితో చిన్నమ్మాయి పై సోషల్ మీడియా లో ఇతరలకు చెప్పడం కాదు ముందు మనం పాటించాలని అని కామెంట్స్ చేస్తున్నారు.దానితో వాటికి రాహుల్ వివరణ ఇచ్చుకోవాల్సి వస్తుంది.ఎంతమందికి ఆదర్శ దంపతులుగా ఉన్న ఈ జంట మన్మథుడు2 చిత్రం తో వార్తలలో నిలవాల్సి వస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: