టాలీవుడ్ యంగ్ హీరోల్లో మొదటి నుండి తాను చేసే సినిమాల్లో కొంత వెరైటీ ఉండాలని ఆశించే హీరోల్లో శర్వానంద్ కూడా ఒకరు అనే చెప్పాలి. రొటీన్ సినిమాలకు భిన్నంగా కాస్త వెరైటీ గా కథలు ఎంచుకునే శర్వానంద్, ఇటీవల హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన పడి పడి లేచే మనసు సినిమాతో కాస్త నిరుత్సాహపడ్డాడు. మంచి అంచనాల మధ్య విడుదలైన ఆ సినిమా ఫ్లాప్ గా నిలిచింది. 

ఇక ప్రస్తుతం రణరంగం మరియు 96 రీమేక్ సినిమాల్లో నటిస్తున్న శర్వానంద్, నిన్న 96 సినిమా రేమేక్ షూటింగ్ లో గాయపడడం జరిగింది. ఈ సినిమా కోసం నిన్న థాయిలాండ్ లో స్కై డైవింగ్ కు సంబంధించి ట్రైనింగ్ తీసుకుంటున్న శర్వానంద్ కు అనుకోకుండా గాయమైందని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ చిత్ర యూనిట్ తమ సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా వెల్లడించింది. అయితే గాయం మరీ అంత పెద్దది అయితే కాదని తెలిసింది. ఇక తగిలిన గాయానికి కాసేపటి క్రితం దాదాపుగా 11గంటలపాటు డాక్టర్లు ఎంతో శ్రమపడి సర్జరీ విజయవంతంగా నిర్వహించారని, అయితే సర్జరీ అనంతరం ఆయనకు 2 నెలలవరకు రెస్ట్ అవసరం అని వారు సూచిందడం జరిగిందట. 

అయితే రెస్ట్ అనంతరం అయన పూర్తిగా కోలుకుని మళ్ళి తన సినిమా షూటింగ్స్ లో పాల్గొనడం జరుగుతుందని అయన పిఆర్ టీమ్ వెల్లడించింది. ఇక సర్జరీ విజయవంతం అవడంతో శర్వా ఫ్యామిలీ మెంబెర్స్ కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేశారట. ఇక కొందరు సినీ ప్రముఖులు శర్వాను జాగ్రత్తగా ఉండాలని, హాయిగా రెస్ట్ తీసుకుని త్వరలో మళ్ళి షూటింగ్స్ లో పాల్గొనాలని కోరుకుంటూ గెట్ వెల్ సూన్ అని మెసేజెస్ చేస్తున్నారట....!! 


మరింత సమాచారం తెలుసుకోండి: