కొన్ని సార్లు హీరోల ఇంట్రడక్షన్స్ డిఫ్రెంట్‌గా ప్రజ్రంట్ చేస్తుంటారు దర్శకులు. అలాగే కొత్తదనం కోసం హీరో క్యారెక్టర్ ను కూడా చాలా కొత్తగా డిజైన్ చేస్తుంటారు. ఇలాంటి వాటి గురించి ముఖ్యంగా పూరి జగన్నాథ్, త్రివిక్రం, మణిరత్నం గురించి చెప్పుకోవాలి. వరుసగా సినిమాలలో ఒక్కోసారి అనుకోకుండా ఒకే రకమైన హీరో పాత్రలు తయారవుతూ వుంటాయి. ఆ మధ్య నాగచైతన్య, నాని క్రికెటర్ లుగా కనిపించారు. విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న సినిమాలో హీరోయిన్ కూడా క్రికెటర్ గా కనిపించబోతోంది. లేటెస్ట్ గా నాని 'గ్యాంగ్ లీడర్' సినిమాలో రైటర్ గా కనిపించబోతున్నాడు. 


అయితే విజయ్ దేవరకొండ కూడా రైటర్ గా కనిపించబోతున్నాడని లేటెస్ట్ న్యూస్. క్రాంతి మాధవ్ డైరక్షన్ లో కేఎస్ రామారావు నిర్మించే సినిమాలో విజయ్ దేవరకొండ రైటర్ గా కనిపిస్తాడట. అలా రైటర్ గా హీరో రాసిన మూడు కథలు సినిమాలో పేక్షకులు చూస్తారన్నమాట. మూడు కథల్లో విజయ్ నే హీరోగా, వేరు వేరు హీరోయిన్లు వుంటారు. అంటే ఒక విధంగా రచయిత రాసిన కథలు కళ్ల ముందు ప్రాణం పోసుకుని కదలాడడం అనుకోవాలి.


ఈ పాయింట్ తో క్రాంతిమాధవ్ ఎలాంటి సినిమా చూపించబోతున్నాడో చూడాలి. ప్రస్తుతమా.. గతంలో దర్శకేంద్రుడు రాఘవేంధ్రరావు రూపొందించిన 'కల్పన' సినిమాలో అల్లు రామలింగయ్య రచయితగా కనిపిస్తాడు. అల్లు రాసే కథల్లో పాత్రలన్నీ కళ్ల ముందుకు వచ్చేస్తుంటాయి. అయితే అదంతా కామెడీ బ్యాగ్డ్రాప్ లో జరుగుతుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: