చిన్న హీరోగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన శర్వానంద్ టాప్ హీరోల జాబితాలో స్థానం సంపాదించడానికి చాలా సమయం పట్టింది.  గత కొంతకాలంగా శర్వానంద్ చేస్తున్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి.  రణరంగం సినిమా రిలీజ్ సిద్ధం అవుతున్నది.  

ఆగష్టు 2 న ఈ సినిమా తెరకెక్కబోతుంది.  ఇదిలా ఉంటె, ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.  డబుల్ రోల్ చేస్తున్నాడు.  ఈ సినిమాతో పాటు శర్వానంద్ తమిళంలో సూపర్ హిట్టైన 96 సినిమాను రీమేక్ లో నటిస్తున్నారు.  ఈ సినిమాను తెలుగు నేటివిటీకి అనుగుణంగా మార్పులు చేసి... షూట్  చేస్తున్నారు. 

స్కై డైవింగ్ కు సంబంధించి ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో శర్వానంద్ భుజానికి గాయం అయ్యింది.  హుడాహుటిన హైదరాబాద్ లోని సన్ షైన్ హాస్పిటల్ కు తరలించారు.  దాదాపు 11 గంటల పాటు శర్వానంద్ భుజానికి శస్త్రచికిత్స చేశారు.  నాలుగు వారాల పాటు రెస్ట్ తీసుకోవాలని సూచించారు.  

96 సినిమాను వీలైనంత త్వరగా షూటింగ్ కంప్లీట్ చేసి సంక్రాంతికి వరకు రిలీజ్ చేయాలనీ అనుకున్నారు.. ఇప్పుడు ఈ పరిస్థితి నెలకొనడంతో షూటింగ్ రెండు నెలలపాటు వాయిదా వేయక తప్పలేదు. 


మరింత సమాచారం తెలుసుకోండి: