ఈ మధ్య కాలంలో టాలీవుడ్ లో ఏ యంగ్ హీరోకి ఇలా జరగలేదు. పారా గ్లయిడింగ్ కారణంగా తీవ్రంగా గాయపడిన హీరో శర్వానంద్ కు సోమవారం శస్త్ర చికిత్స జరిగింది. డాక్టర్ గురవారెడ్డి ఈ ఆపరేషన్ ను చేశారని సమాచారం. షోల్డర్ బాగా గాయపడడం, చేతికి, కాలికి చిన్న చిన్న గాయాలు తగలడంతో, శర్వానంద్ పూర్తిగా కోలుకుని, మళ్లీ చురుగ్గా షూటింగ్ లో పాల్గొనడానికి మూడు నెలలు టైమ్ పట్టే అవకాశం వుందట.


శస్త్ర చికిత్స అయిన తరువాత శర్వానంద్ నార్మల్ అయినప్పటికి కనీసం నెల నుంచి నెలన్నర విశ్రాంతి తప్పనిసరి అని డాక్టర్ చెప్పారట. ఆ తరువాత కూడా ఫిజియోథెరపీ లాంటివి అవసరం పడతాయన్న వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం దిల్ రాజు నిర్మాణంలో శర్వానంద్ చేస్తున్న 96 రీమేక్ సినిమా పనులు అన్నీ రెండు నెలలు వాయిదా వేశారని లేటెస్ట్ అప్‌డేట్. ఇప్పటికే పూర్తి అయిన సుధీర్ వర్మ డైరక్షన్ లోని రణరంగం సినిమా వర్క్ అంతా పూర్తయింది. డబ్బింగ్ కూడా అయిపోయింది. కేవలం ప్రమోషన్ మాత్రమే జరగాల్సి వుంది. 

ఈ సినిమా కాకుండా, తమిళ-తెలుగు భాషా చిత్రం ఒకటి ఓకె చేసారు. ఆ సినిమా ఇంకా ప్రారంభం కాలేదు. ఈ సినిమాతో పాటు ఇంకో సినిమాకు కూడా ఓకె చెప్పారు శర్వా. ఈ రెండు సినిమాలు పూర్తిగా కోలుకున్నాక, 96 సినిమా రీమేక్ పూర్తయిన తరువాత గానీ మొదలయ్యో అవకాశం ఉంది. ఇక ఈ మధ్యకాలంలో వరుసగా టాలీవుడ్ హీరోలు  గాయాలపాలవుతున్నప్పటికి ఇంత పెద్ద మేజర్ ఇన్సిడెంట్ మాత్రం శర్వాకే జరిగింది.



మరింత సమాచారం తెలుసుకోండి: